అధ్య‌క్ష ఫ‌లితాలు టై అయితే....

Update: 2016-11-05 15:31 GMT
ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక ప‌ర్వంలో ప్ర‌చారం హోరాహోరీగా సాగ‌గా ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. న‌వంబ‌ర్ 8న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అస‌లు ఆ రోజున ఏం జ‌రుగుతుందనేది తెలుసుకునేందుకు అనేక‌మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. వాషింగ్ట‌న్ డీసీతో పాటు మొత్తం 50 రాష్ట్రాల్లో పోలింగ్ బూత్‌ లు ఉద‌య‌మే ప్రారంభం అవుతాయి. వేరువేరు టైమ్ జోన్ల‌లో పోలింగ్ బూత్ల‌ను తెరుస్తారు. చాలా ప్రాంతాల్లో ఉద‌యం ఆరు లేదా ఏడు గంట‌ల‌కు మొద‌లై - రాత్రి ఏడు లేదా 8 గంట‌ల‌కు ముగుస్తాయి. ఐయోవా - నార్త్ డ‌కోటాలో మాత్రం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు బూత్‌ లు తెరిచి ఉంటాయి. ఈసారి ఎన్నిక‌ల్లో సుమారు 120 మిలియ‌న్ల అమెరికన్ల ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఎన్నిక‌ల ముగిసిన వెంట‌నే కౌంటింగ్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాతే శ‌క్తివంత‌మైన అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని ఎవ‌రు గెలుచుకున్నారో తెలుస్తుంది.

ఫ‌లితాలు వెల్ల‌డికాగానే అమెరికా 45వ అధ్య‌క్షులు ఎవ‌ర‌న్న విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది. విజేత హిల్ల‌రీ అయినా లేక‌ ట్రంప్ అయినా - తొలి ఫ‌లితం నార్త్ హ్యాంప్‌ షైర్‌ లోని డిక్స్‌ విల్లీ నాచ్ నుంచి వెల్ల‌డ‌య్యే ఛాన్సుంది. కెన‌డా బోర్డ‌ర్‌కు స‌మీపంలో ఉండే డిక్స్‌ విల్లీ ఫ‌లితం మిగ‌తా దేశం కంటే 24 గంట‌ల ముందే తొలి ఫ‌లితాన్ని వెల్ల‌డించే అవ‌కాశాలున్నాయి. హిల్ల‌రీ - ట్రంప్‌ లు న్యూయార్క్‌ లో ఓటు వేసే ఛాన్సుంది. ఎన్నిక‌ల రోజు రాత్రి 11 గంట‌ల లోపే తూర్పు రాష్ట్రాల్లో ఎవ‌రు ఆధిక్యంలో ఉన్నార‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా మ్యాజిక్ ఫిగ‌ర్ 270 సీట్లు సాధించాల్సిందే. ఒక‌వేళ రెండు పార్టీలు 269 సీట్లు సాధిస్తే - అప్పుడు టై ఏర్ప‌డుతుంది. ఆ ద‌శ‌లో హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ ప్ర‌తినిధులు ఓటింగ్‌ తో నూత‌న అధ్య‌క్షున్ని ఎన్నుకుంటారు. గెలిచినా...ఓడినా హిల్ల‌రీ - ట్రంప్ జాతినుద్దేశించి మాట్లాడుతారు.

అమెరికాలో ఎన్నిక‌లు సాధార‌ణంగా న‌వంబ‌ర్‌లోనే నిర్వ‌హించ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఆ దేశం ఎక్కువ‌గా వ్య‌వ‌సాయం మీదే ఆధార‌ప‌డుతుంది. న‌వంబ‌ర్ సీజ‌న్‌ లో గ్రామీణుల‌కు ఎక్కువ‌గా ప‌ని ఉండ‌దు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓట‌ర్లు మంగ‌ళ‌వారం రోజున సిటీకి వ‌చ్చి ఓటు వేసే వీలు ఉంటుంది. దీని వ‌ల్ల సెలువు దినం ఆదివారం రోజునే హ‌డావుడి ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అమెరికాలో ఈ సాంప్ర‌దాయ‌మే చాన్నాళ్లుగా కొన‌సాగుతోంది. న‌వంబ‌ర్‌లో వ‌చ్చే తొలి సోమ‌వారం త‌ర్వాత తొలి మంగ‌ళ‌వారం సాధార‌ణంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. అమెరికాలో ఓటింగ్ ప్ర‌క్రియ కూడా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క ప‌ద్ధ‌తిని పాటిస్తాయి. కొన్ని చోట్ల ఓటు వేసిన రోజే ఓట‌ర్ల త‌మ ఓటును న‌మోదు చేసుకోవ‌చ్చు. కొన్ని చోట్ల వారాల ముందే ఓటును న‌మోదు చేసుకోవాలి. ఓట‌ర్లు మెయిల్ ద్వారా కూడా ఓటు వేయ‌వ‌చ్చు. పోలింగ్ బూత్‌ ల ద‌గ్గ‌ర కూడా క్యూ క‌ట్టి ఓటు వేయ‌వ‌చ్చు. ఫోటో ఐడెంటీ కార్డు లేనివాళ్లు ఆఫిడ‌విట్ స‌మ‌ర్పించు ఓటు వేయ‌వ‌చ్చు. ఒక‌వేళ ఐడీ స‌మ‌ర్పించ‌డం ఆల‌స్య‌మైతే ఆ ఓట్ల‌ను లెక్కించే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. ఈసారి క‌నీసం ఏడు రాష్ట్రాలు క‌చ్చితంగా ఫోటో ఐడీ కార్డులు కావాలంటూ ఓట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News