ఒత్తిడిలో ఏనుగులు.. గంజాయ్ తో రిలీఫ్

Update: 2020-08-28 02:30 GMT
మనకంటే పొద్దున్న లేస్తే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు, పని ఒత్తిడి.. ఇది తగ్గడానికి రాత్రి మందేసి పడుకుంటాం.. మరి ఏనుగులకు ఒత్తిడి కలిగితే ఏం చేస్తాయి.? గంజాయి తాగుతాయి.. అవును గంజాయితో వాటిని కూల్ చేస్తున్నారట..

పోలాండ్, వార్ని జూలో ఏనుగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయట.. అందుకే అక్కడ జూ అధికారులు ఏనుగుల ఒత్తిడిని తగ్గించేందుకు గంజాయితో చికిత్స అందిస్తున్నారు. అది కూడా వైద్య పరంగా గంజాయిని వినియోగిస్తున్నామని అంటున్నారు. గంజాయి ఏనుగుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు అంటున్నారు. ఏనుగుల ఒత్తిడి తగ్గించడానికి సహజమైన పద్ధతిలో జూ అధికారులు ద్రవరూపంలో గంజాయిని ఇస్తున్నారు.

గత మార్చిలో జూలో ఆడ ఏనుగు చనిపోయింది. అతి తీవ్ర ఒత్తిడితో చనిపోయిందని తేల్చారు. దీంతో మరో ఏనుగు ఒత్తిడిలోకి వెళ్లిపోయి ఒంటరిగా ఉంటోంది. అందుకే దానికి గంజాయి ఇచ్చి స్వాంతన చేకూరుస్తున్నారు.

ఏనుగుల గుంపులో సన్నిహితమైన ఏనుగు చనిపోతే వాటి స్నేహితులైన ఏనుగులు నెలలు, సంవత్సరాల పాటు పరిశోధనల్లో తేలింది.
Tags:    

Similar News