తెలంగాణ ఆవిర్భావ దినం: రాష్ట్ర ఏర్పాటులో కీలక అంశాలు

Update: 2022-06-02 07:33 GMT
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరు ఈనాటిది కాదు. నైజాం పాలన  నుంచే ఈ ప్రాంతా వాసులు తమకు విముక్తి కల్పించాలని ఎన్నో పోరాటాలు చేశారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత ప్రత్యేక రాష్ట్రంగానే ఉండేది. కానీ భాష రాష్ట్రాల ప్రతిపదికన 1956లో ఆంధ్రాలో తెలంగాణ విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 48 ఏళ్ల పాటు ఎందరో ప్రాణ త్యాగాలు.. మరెందరో జీవితాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్ర సాధనకు పాటుపడ్డారు. నాటి నుంచే నేటి వరకు .. ఇప్పటి తరానికి 2009 నుంచి జరిగిన తెలంగాణ పోరాటం గురించే తెలుసు. కానీ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని పుస్తకాల్లో మాత్రమే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జరిగిన కొన్ని ఘట్టాలు గురించి తెలుసుకుందాం..

1948 కు ముందు తెలంగాణ ప్రాంతం నైజా నవాబుల ఆధీనంలో ఉండేది. ఆప్పుడు ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రం అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనాల్లో భాగంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో   హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనం అయింది. అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ రాష్ట్రంగానే కొనసాగింది. అయితే 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిగిపింది. హైదరాబాద్ కు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

అయితే 1969లో పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు మొదటిసారి ఉద్యమం చేపట్టారు. అయితే ఈ ఉద్యమంపై అప్పటి ప్రభుత్వం వ్యతిరేకత చూపింది. ఉద్యమాన్ని అణిచివేసింది. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 300 మంది చనిపోయారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. 1973లో నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. దీంతో ఆ సమయంలో ఉద్యమాలు ఆగిపోయాయి.

అప్పటి నుంచి మళ్లీ తెలంగాణ కోసం ఎవరూ ఆందోళన చేయలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఈయనకు ప్రొఫెసర్ జయశంకర్, తదితర మేధావులు మద్దతు పలికారు. 2009లో ఈ పోరు తీవ్రం కావడంతో చంద్రశేఖర్ రావు అమరణ నిరాహార దీక్ష చేశారు. ఈయన దీక్షతో తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంత చారి ఆత్మ బలిదానం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది.

అయితే 2010లో ఆంధ్రలో వ్యతిరేకత ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. దీంతో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారు. ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు తెలంగాణ ప్రాంత వాసులను సంతృప్తి పరచలేకపోయింది. దీంతో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జేఏసీ ఏర్పడింది. ఇందులో ప్రజా సంఘాలు,ఇతర పార్టీలు కలిసి మిలియన్ మార్చ్, సాగర హారం, చలో అసెంబ్లీ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ఆందోళన నేపథ్యంలో 2013లో హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై చర్చ జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  నేతృత్వంలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. కానీ పార్లమెంట్, రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం తెలిసింది. దీంతో జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల కల నెరవేరింది.

ఉద్యమించిన టీఆర్ఎస్ కే ప్రజలు పట్టకట్టడంతో కేసీఆర్ సీఎం అయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో సంక్షేమం, అభివృద్ధితో ప్రజల మనసులు గెలిచారు. రెండోసారి కూడా కేసీఆర్ అభివృద్ధి చేసి గెలిచారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అయిన సందర్భంగా ఈ వేడుకను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు.
Tags:    

Similar News