ఒక పార్టీలో ముసలం అనేది పుట్టకూడదు. పుట్టిందా అది క్యాన్సర్ లా వ్యాపిస్తుంది. అదీగాక ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పార్టీలో వ్యతిరేకులు తయారైతే.. అది పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అందుకే పతనైపోయింది. ఇప్పుడు కమల్ హాసన్ పెట్టిన మక్కల్ నీది మయ్యం పార్టీలో కూడా అలాంటి పరిస్థితులో కన్పిస్తున్నాయి.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నట్లు కమల్ హానస్ ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థుల్ని కూడా ఫైనల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కుమరవేలు అనే నాయకుడు బయటకు వచ్చేశాడు. ఈ కుమరవేలు మరెవరో కాదు కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. అంటే చాలా కీలకం అన్నమాట. అభ్యర్థుల ఎంపికల్లో కమల్ హాసన్ నిజాయితీగా లేరని.. బయటికన్నా కమల్ స్టాఫించిన పార్టీలనే రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు చేశారు. ముందునుంచీ ఉన్నవారికి సరైన స్థానం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలో ఇమడలేకే బయటికి వచ్చేశానని ప్రకటించారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బయటికి రావడం కమల్ హాసన్ కు పెద్ద దెబ్బే. మరి దీన్ని ఆయన ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.