వైసీపీలో రాజీనామాల ఎపిసోడ్‌.. ఏం జ‌రుగుతోందంటే..!

Update: 2022-10-22 08:49 GMT
వైసీపీలో రాజీనామాల ఎపిసోడ్ పుంజుకుంది. మూడు రాజ‌ధానుల కోసం.. అంటూ.. ఇప్ప‌టికే విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ..త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే.. ఇది స్పీక‌ర్ ఫార్మాట్‌లో లేక‌పోవ‌డంతో .. ఆయ‌న వివాదాల‌కు చిక్కారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. అమ‌రావ‌తి రైతులు.. చేస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0ను నిలువ‌రించాల‌ని.. వైసీపీ ఉత్త‌రాంధ్ర నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే.. హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. హైకోర్టు మాత్రం నిలుపుద‌ల‌కు ఏమాత్రం అంగీక‌రించ‌లేదు.

మ‌రోవైపు.. రైతుల పాద‌యాత్ర అత్యంత వేగంగా.. ఉత్త‌రాంధ్ర దిశ‌గా సాగిపోతోంది. ఈ నేప‌థ్యంలో దీనిని ఏదో ఒక విధంగా అడ్డుకుని తీరాల‌నేది.. వైసీపీ నాయ‌కుల వ్యూహం. అడ్డుకునేందుకురాజ‌మండ్రిలో ప్ర‌య‌త్నించినా.. హైకోర్టు సీరియ‌స్ అయింది.

ఈ క్ర‌మంలో దీనిని తాము నేరుగా అడ్డు కునే కంటే.. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటునుర‌గిలించ‌డం ద్వారా.. ప్ర‌జ‌లే రైతుల‌కు నిర‌స‌న తెలిపేలా వ్య‌వ‌హ‌రించాల‌ని.. వారిని ఆదిశ‌గా ప్రోత్స‌హించాల ని.. వైసీపీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. పార్టీ శ్రేణులు.. ప్ర‌జ‌ల‌కు.. మూడు రాజ‌ధానుల ప్రాధాన్యం వివ‌రించాలని సూచించారు.

ఈ క్ర‌మంలో రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు నిర‌స‌న‌గా.. వారు ప్ర‌యాణించే మార్గాల్లో.. బంద్ పాటించాల‌ని... బైకు ర్యాలీలు నిర్వ‌హించి నిర‌స‌న తెల‌పాల‌ని అన్నారు. ఇక‌, ధర్మాన ప్ర‌సాద‌రావు ఏకంగా.. త‌న మంత్రి పీఠాన్ని వ‌దులుకునేందుకు రెడీ అయ్యారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ.. తాజాగా సీఎం ముందు ప్ర‌తిపాద‌న పెట్టారు. అయితే.. దీనికి సీఎం ఒప్పుకోలేద‌ని స‌మాచారం.

ఇదిలావుంటే.. మ‌రో మంత్రి శ్రీకాకుళానికి చెందిన‌.. సీదిరిఅప్ప‌ల‌రాజు కూడా.. ఈ రోజో రేపో.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు లీకులు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నిజంగానే.. వీరు రాజీనామాలు చేస్తారా?  లేక‌.. ఈ ప్ర‌క‌ట‌నల ద్వారా..

వేడి పుట్టించాల‌నే వ్యూహం ఏదైనా ఉందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా.. ఉత్త‌రాంధ్ర‌లో ఇప్పుడు.. రాజ‌కీయ అల‌జ‌డి అయితే.. ప్రారంభ‌మైంది. చూడాలి.. వైసీపీనేత‌లు ఎలా ముందుకు సాగుతారో.. అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News