తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన బీజేపీ వైపు ఇప్పుడు అసంతృప్తుల చూపు పడుతోంది. దుబ్బాకలో విజయం.. జీహెచ్ఎంసీలో సత్తా చాటడంతో టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలు అంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ లోని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరగా.. తాజాగా ఏకంగా టీఆర్ఎస్ కేబినెట్ లోని మంత్రి ఎర్రబెల్లి సోదరుడు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలతో బీజేపీలో ఫుల్ జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు మొదలయ్యాయని సమాచారం.
టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తాజాగా బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి రంగం సిద్ధమైనట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ప్రదీప్ రావు కన్నేసినట్లు తెలిసింది. ప్రదీప్ వెళ్లిపోయినా ప్రభావం ఏమీ ఉండదని.. తన సోదరుడు వెళ్లినంత మాత్రాన టీఆర్ఎస్ కు వచ్చిన ఢోనా ఏమీ లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నట్టు తెలిసింది.