అసెంబ్లీలో టిఫిన్ చేసేందుకు వీలులేదు.. ఈటల ఆవేదన.. మంత్రుల కౌంటర్

Update: 2023-02-08 20:00 GMT
అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే తమ వ్యక్తిగత సమస్యలను ఏకరువు పెట్టారు. ఇది సభా సంప్రదాయం కాదని బీఆర్ఎస్ మంత్రులు ఈటలకు హితవు పలికారు. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే వసతి కల్పిస్తారని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యులమైన తమకు సరైన గౌరవం లభించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన తమకు టిఫిన్ చేసేందుకు కూడా సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేకు ఇది అవమానమని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ కంటే ముందు మాకు రెండు సమస్యలు ఉన్నాయని ఈటల రాజేందర్ సభలో ప్రస్తావించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ సభ్యులకు వసతి కల్పించడం లేదని చెప్పారు. బీజేపీ సభ్యులకు కనీసం టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదని వాపోయారు. ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకు కూడా అవకాశం కల్పించడం లేదన్నారు. దీనిపై చాలా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని.. తనను అవమానించడం కాదని.. ఎమ్మెల్యేలను ఇది అవమానించడం అంటూ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈటల మాటలను మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. బడ్జెట్ పై చర్చించే సమయంలో సదుపాయాలపై మాట్లాడడం తగదని అన్నారు. అలాంటి అంశాలను సభాపతి కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేయాలని హరీశ్ రావు సూచించారు. మరోవైపు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసానిలు కూడా జోక్యం చేసుకొని ఈటలకు శాసనసభ సంప్రదయాలు వివరించారు.

అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ బడ్జెట్ పై సాధారణ చర్చ ప్రారంభం కాగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటోందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదన్నారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సైతం బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మొత్తంగా అధికార బీఆర్ఎస్ పై, బీజేపీపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు కౌంటర్, ఎన్ కౌంటర్లతో చాలా హాట్ హాట్ గా సాగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News