హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై క్లారటీ లేకున్నా.. దాని చుట్టూ తిరుగుతున్నరాజకీయం మాత్రం మహా రసవత్తరంగా సాగుతోంది. నేతల అంత:పురంలో జరిగిన సీన్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈటలను బద్నాం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ నేతలు.. వరుస పెట్టి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 200 ఎకరాల ఆసామి అంటూ హరీశ్ చేసిన ఘాటు విమర్శకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈటల రియాక్టు అయ్యారు. తనను బద్నాం చేస్తున్న హరీశ్ కు ఇంతకిందా తప్పదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.
‘హరీశ్ నీ మోసపూరిత మాటల్ని హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నవ్. మీ మామ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నవ్. ఎప్పటికైనా నాలెక్కనే నీ పని కూడా టీఆర్ఎస్ లో ముగుస్తది గుర్తుపెట్టుకో’ అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. కరీంనగర్ లోని జమ్మికుంటలో మాట్లాడిన ఆయన.. ‘మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నవ్. ఇక్కడ నేను రాజకీయాలతో సంబంధం లేకున్నా.. రాజకీయ కుటుంబం కాకున్నా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ప్రజలు ప్రేమతో అప్రతిహతంగా గెలిచిన వ్యక్తిని. నువ్వు అసలు సర్పంచ్ గా గెలవకుండానే మంత్రిగా మారినవనే విషయాన్ని గుర్తు పెట్టుకో. 18 ఏళ్ల అనుబంధంలో నువ్వేందో నాకు తెలుసు. నేనేందో నీకు తెలుసు. చిల్లర ప్రయత్నాలు చేసి అభాసుపాలు కాకు’’ అని విరుచుకుపడ్డారు.
అంతేకాదు.. హరీశ్ కు సంబంధించిన మరో ఆసక్తికర అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మెత్తటి దిండు తడిచే దాకా నువ్వు ఎన్నిసార్లు ఎడ్చినవో నాకు తెలియదా? అధర్మపు మాటలు మాట్లాడకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హుజూరాబాద్ లో ఓడించేందుకు రూ.192 కోట్లు ఖర్చు చేశారని.. ముఖ్యమంత్రి పెట్టినంత ఖర్చు తాను పెట్టలేనని చెప్పారు. అవసరమైతే ఇక్కడి ప్రజల వద్దకు వెళ్లి ఇంటింటి నుంచి రూ.వెయ్యి ఇవ్వండంటూ అడిగి ఎన్నికల్లో ఖర్చు చేస్తానని వ్యాఖ్యానించారు. ఈటలపై ఘాటు విమర్శలు చేసిన ఈటల నోట మళ్లీ మాట రాలేని రీతిలో ఈటల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అన్ని బాగున్నాయి.. మెత్తటి దిండ్లు తడిచే దాకా ఏడ్చారన్న ఈటల మాటకు హరీశ్ ఏం బదులిస్తారో?