అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలితో ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులు మొదలయ్యాయి. ఐరోపా దేశాలతో కలిసి ఉన్న నాటో కూటమి నుంచి అమెరికా బయటకు వచ్చేయడం.. రష్యాతో చెట్టపట్టాలేసుకుంటుండడంతో ఐరోపా యూనియన్ దేశాలు మండిపడుతున్నాయి. తాజాగా దీనిపై అవన్నీ భేటీ కావడానికి రెడీ అవుతున్నాయి.
మాల్టా రాజధాని వలెటాలో జరిగిన ఈయూ అనధికార సదస్సులో ట్రంప్ వ్యవహారంపై పలు దేశాధినేతలు మండిపడ్డారట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఈ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుంచి వస్తోన్న‘ఒత్తిడి’ని అడ్డుకోకుంటే యూరప్ మనుగడలో లేకుండాపోయే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అడ్డుకునేందుకు ఈయూలోని 28 దేశాలూ ఒక్కతాటిపైకి రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలు అమెరికా, రష్యాలపై ఇకపై ఆధారపడటం మానుకోవాలని, సొంతంగా రక్షణ, వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. లేదంటే యూరప్ నష్టపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఐరోపా యూనియన్ విచ్ఛిన్నానికి రష్యా, అమెరికాలు కలిసి కుట్ర పన్నుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాటో లాంటివే సంయుక్త రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుందామని ఫ్రాన్సు అధ్యక్షుడు పిలుపునిచ్చారు. మొత్తానికి ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్ భారీ కుదుపునే తెచ్చేటట్టున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/