టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతడు వచ్చిరాగానే ట్విట్టర్ ను తన చేతుల్లోకి తీసుకోగానే మొదటి చేసిన పని భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, కంపెనీ పాలసీ చీఫ్ విజయ గద్దె ఇతరులను తొలగించి గట్టి షాక్ ఇచ్చాడు.
ఇక ట్విట్టర్ యజమానులు మారినా సరే భారత దేశ చట్టాలను అనుసరించాలని.. గౌరవించాల్సిందేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు యజమానులతో సంబంధం లేకుండానే కొనసాగుతాయని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ట్విటర్ లో నిషేధం ఎదుర్కొంటున్న వారిపై ప్రభుత్వ స్పందన గురించి అడగ్గా మంత్రి స్పందించారు. అతి తర్వలోనే సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధలు విడుదల కానున్నాయని.. వీటి కోసం కొన్ని నెలల పాటు సంప్రదింపులు జరిగాయని తెలిపారు.
గతంలో ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అన్ని సోషల్ మీడియాలు అమలు చేసినా ట్విట్టర్ మాత్రం నాన్చుతూ వచ్చింది. కేంద్రం నోటీసులు జారీ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు. దేశంలో బాధ్యులను నియమించలేదు. దీంతో కేంద్రం సీరియస్ అయ్యి తుది హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. రక్షణను ఉపసంహరించుకుంది.
ఇక ట్విట్టర్ కూడా కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాలను కొద్దిసేపు బ్లాక్ చేసి కేంద్రంతో ఫైట్ కు దిగింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా నిన్నటి దాకా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ఖాతానే నిలుపుదల చేసింది. కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న ట్విట్టర్ తాజాగా వెనక్కి తగ్గింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలో రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ ను ట్విట్టర్ నియమించింది. దీంతో వివాదానికి ముగింపు పడింది.
ఇప్పుడు ట్విట్టర్ యజమానిగా ఎలన్ మస్క్ మారడంతో అతడి తీరు భారత ప్రభుత్వంతో ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే భారత్ లో కంగనా రౌనత్ లాంటి వారు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని వారి అకౌంట్లను నిషేధించారు.మస్క్ వచ్చాక ఆయన వ్యవహారశైలి ఎలా మారుతుందన్నది వేచిచూడాలి. భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారా? లేక కయ్యానికి దిగుతారా? అన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.