దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలను నిర్దేశించే రాష్ట్రంగా పేరొందిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారిగా రెండు ప్రధాన రాష్ర్టాలైన మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చనున్నదని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు పేర్కొంటుండగా...మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఒక గ్రామంలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడిందని ఆరోపణలు తెరమీదకు రావడం సంచలనాన్ని సృష్టిస్తోంది.
సతారా ఎంపీ ఉదయన్ రంజీ - తన ఎంపీ పదవికి రాజీనామా చేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీతో పాటే సతారా లోక్ సభకు ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్ ప్రారంభమై అప్పటికి చాలా సమయమే అయింది. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో ఓటర్ల నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది. అనంతరం పలువురు ఇదే ఫిర్యాదు చేశారు. ఓటు వేస్తే బీజేపీ ఎన్నికల గుర్తు కమలం వద్ద లైటు వెలిగిందని చెప్పారు. దీన్ని గుర్తించిన అధికారులు కూడా ఈవీఎం మెషిన్ లో ఏదో లోపం ఉన్నదని అంగీకరించారని - దాని స్థానంలో మరోటి చేశారని పేర్కొన్నారు.
ఎన్సీపీకి నేత శశికాంత్ షిండే ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ... సతారా పరిధిలోని నావ్లేవాది గ్రామంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ``గ్రామంలోని ఓటర్లు ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకే పడింది. దీంతో మా పార్టీ కార్యకర్తలు - గ్రామస్థులు విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నేను అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడాను. అప్పడికే దాదాపు 293 ఓట్లు ఈ విధంగా బీజేపీకి పడ్డాయి. అధికారులను నిలదీయడంతో వారు అప్పటికప్పుడు ఆ ఈవీఎంను మార్చారు`` అని తెలిపారు. పోలింగ్ అధికారిణి కీర్తి నలవాడే స్పందిస్తూ కొత్త ఈవీఎం మెషిన్ ను ఏర్పాటు చేసింది వాస్తవమే. మెషిన్ బటన్ లో సమస్య ఉండటం వల్లే మార్చాం అని చెప్పారు. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించామని, అప్పుడు పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని పేర్కొన్నారు.