మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అక్కడ వెలుగు చూసిన ఒక భారీ సెక్స్ రాకెట్ పై పోలీసులు పరిశోధన కొనసాగించగా.. ఆ వ్యభిచార ముఠా దగ్గర సంచలన వీడియోలు - ఫొటోలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు - ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ కు కూడా సదరు ముఠా అమ్మాయిలను సరఫరా చేసినట్టుగా - ఆ అమ్మాయిలతో ఆ రాజకీయ నేతలు రసవత్తర భంగిమల్లో ఉండగా.. ఫొటోలను - వీడియోలను ఆ ముఠా తీసిందని వార్తలు వస్తున్నాయి.
పోలీసుల పరిశోధనలో ఈ విషయం తేలిందట. తనను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని - ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించగా అసలు కథ బయటకు వచ్చిందని సమాచారం. అదో భారీ సెక్స్ రాకెట్ అని తేలిందట.
అనేక మంది రాజకీయ నేతలతో ఆ ముఠాకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. ప్రత్యేకించి మధ్యప్రదేశ్ లో మొన్నటి వరకూ ఒక పార్టీ అధికారంలో ఉండేది. ఆ పార్టీకి చెందిన నేతలకు ఆ ముఠాతో సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసుల విచారణ తేలిందట. ఈ క్రమంలో మాజీ సీఎం ఒకరు - మాజీ గవర్నర్ ఒకరికి సంబంధించిన ఫొటోలు - వీడియోలు ముఠా వద్ద ఉన్నాయని పోలీసులు లీకులు ఇస్తూ ఉండటం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలను బ్లాక్ మెయిల్ చేయడానికే ప్రభుత్వం ఈ లీకులు ఇస్తోందని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ కేసును విచారణకు సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. భారీ స్థాయి స్కాములు మధ్యప్రదేశ్ కేంద్రంగా ఇది వరకే తేలాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈ సెక్స్ స్కామ్.. ఎంత వరకూ వెళ్తుందనేది సర్వత్రా ఆసక్తిదాయకంగా మారింది.