ప్రపంచ దేశాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ మిగతా వాటి కంటే వేగంగా కోలుకుంటోంది. ఆగస్ట్ నెలలో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు క్షీణించాయి. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో చైనా ఎగుమతులు 9.5శాతం పెరగగా, దిగుమతులు 2.1శాతం పడిపోయాయి. చాలా దేశాల్లో కరోనా ఆందోలనలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో చైనా నుండి ఎగుమతులు పెరిగినట్లుగా భావించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో 7.1శాతం మేర ఎగుమతులు పెరుగుతాయని ఆ దేశ నిపుణులు భావించారు. కానీ అంతకుమించి పెరగడం గమనార్హం. ఎగుమతులు భారీగా పెరిగి, దిగుమతులు కొంత తగ్గడంతో చైనాలో మొత్తంగా వాణిజ్య మిగులు పెరిగింది.
అమెరికాతో పోలిస్తే ఆగస్ట్ మాసంలో చైనా వాణిజ్య మిగులు 27శాతం పెరిగినట్లు స్థానిక పత్రిక కథనాలు వెల్లడిస్తున్నాయి. 2019 ఏప్రిల్ నెల నుండి చైనా ఎగుమతులు ఈ స్థాయిలో పెరగడం ఇది తొలిసారి. దిగుమతులు వరుసగా రెండో నెల తగ్గుముఖం పట్టాయి. చైనా దిగుమతుల వృద్ధి ఈ ఏడాది జూన్ నెలలో మాత్రమే పెరుగుదలను నమోదు చేసింది. చైనా ట్రేడ్ బ్యాలెన్స్ జూలై నెలలో 62.33 బిలియన్ డాలర్లు కాగా, ఆగస్ట్ నెలలో 58.93 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది ఎగుమతుల పెరుగుదల, దిగుమతుల తగ్గుదలను వెల్లడిస్తోంది.
కరోనా వైరస్ షట్ డౌన్ నుండి డ్రాగన్ దేశం వేగంగా పుంజుకుంది. ఎగుమతులు, పెట్టుబడుల్ని వేగవంతం చేసింది. ఆగస్ట్ మాసంలో అమెరికాకు ఎగుమతులు 20శాతం పెరిగాయి. గత నెలలో ఎగుమతులు 44.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా నుండి దిగుమతులు 1.8 శాతం పెరిగి 10.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆగస్ట్ నెలలో అమెరికాతో చైనా వాణిజ్య మిగులు 34.2 బిలియన్ డాలర్ల కాగా, జూలైలో 32.46 బిలియన్ డాలర్లుగా ఉంది.