గిడ్డిని చేర్చుకోవ‌డం వెనుక బాబు ప్లాన్ ఇదే

Update: 2017-11-30 08:18 GMT
ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అడుగు తీసి అడుగు వేస్తే.. `నాకేంటి లాభం` అని ఆలోచించ‌కుండా బాబు అడుగు వేయ‌ర‌నే మాట కూడా ఉంది. 2014లో అధికారం ద‌క్కించుకున్నారు. ఇక‌ - 2019 మాత్ర‌మే కాదు.. రాబోయే 30 ఏళ్ల‌పాటు సీఎం సీటుతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని సైతం త‌న సొంతం చేసుకోవాల‌ని ఇప్ప‌టికే పెద్ద స్కెచ్ సిద్ధం చేసుకున్న చంద్ర‌బాబు.. దానికి అనుగుణంగానే పావులు క‌దుపుతున్నార‌ని తాజా విశ్లేష‌ణ‌లు వివ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ‌లంగా ఉన్న వైసీపీని బ‌ల‌హీనం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల‌ను  త‌న చెంత‌కు చేర్చుకుని సైకిలెక్కించేసుకుంటున్నారు. అంతా ఫ్యూచ‌ర్‌ ను దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు వ్యూహ ప్ర‌తివ్యూహాలతో ముందుకు పోతున్నారు.

తాజాగా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని చంద్ర‌బాబు త‌న కూట‌మిలో చేర్చుకున్నారు. అయితే, ఇదంత వీజీగా జ‌రిగిపోలేద‌ని - అటు గిడ్డి ఈశ్వ‌రికి ప‌ద‌వుల తాయిలాలు ప్ర‌క‌టించ‌డంతో పాటు.. టీడీపీ భ‌విష్య‌త్తుకు కూడా బంగారు బాటలు వేసుకోవాల‌నే ఉద్దేశంతోనే చంద్ర‌బాబు గిడ్డికి ఆహ్వానం ప‌లికార‌ని `అస‌లు విష‌యం` ఆల‌స్యంగా వెలుగు చూసింది. మరి ఆవిశేషాలేంటో చూద్దాం...  2004కు ముందు పాడేరు స‌హా ఏజెన్సీ ప్రాంతంలో టీడీపీకి మంచి ప‌ట్టుంది. దీంతో అక్క‌డ ప‌చ్చ‌జెండా ఎగ‌ర‌ని ప్రాంతం అంటూ ఏదీ ఉండేదికాదు. అయితే, కాంగ్రెస్ నేత దివంగ‌త వైఎస్ దెబ్బ‌కు అక్క‌డ 2004లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో టీడీపీ ప్ర‌భ ప‌డిపోయింది. క‌నీసం జెండా మోసే దిక్కు కూడా లేకుండా పోయింది.

ఇక‌, ఈ ప‌రిస్తితిలో 2014లో చంద్ర‌బాబు కూట‌మి నేప‌థ్యంలో ఇక్క‌డి పాడేరు టిక్కెట్‌ ను బీజేపీకి కేటాయించారు. ఎలాగూ టీడీపీకి కేడ‌ర్ లేదుకాబ‌ట్టి.. బీజేపీకి ఇస్తే.. దాని తంటా అది ప‌డుతుంద‌ని బాబు ప్లాన్‌. అయితే, అనూహ్యంగా ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన గిడ్డి ఈశ్వ‌రి విజ‌య‌దుందుభి మోగించారు. దీంతో మొత్తానికి టీడీపీ లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే ఈశ్వ‌రి ఇంటింటికీ తిరిగి.. గిరిజ‌నుల‌ను జ‌గ‌న్‌ కు ద‌గ్గ‌ర చేశారు. దీంతో ప్ర‌స్తుతం పాడేరే స‌హా గిరిజ‌న గ్రామాల్లో వైసీపీకి మంచి ప‌ట్టు వ‌చ్చేసింది. ఇక్క‌డ ఎవ‌రు పోటీ చేసినా.. గెలిచే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. ఎలాగైనా ఇక్క‌డి తిరిగి టీడీపీకి వైభ‌వం తేవాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త్రిస‌భ్య క‌మిటీని ఒక‌దానిని ఏర్పాటు చేశారు. అయినా కూడా ఈ త్రిస‌భ్య క‌మిటీ టీడీపీని ముందుకు తీసుకు వెళ్ల‌లేక పోయింది.

దీంతో ఇక‌, లాభం లేద‌ని భావించిన చంద్ర‌బాబు.. గిడ్డి ఈశ్వ‌రిని త‌న పార్టీలో చేర్చుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గంలేద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో పాడేరు నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యులైన మణికుమారి - నాగరాజు - ప్రసాద్‌ లను పిలిపించి మాట్లాడారు.  మరో పార్టీ నుంచి ఎవరు వచ్చినా స్వాగతం పలికి వారితో కలిసి పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారని సమాచారం. గిడ్డి ఈశ్వ‌రి చేరిక తర్వాత సీనియర్‌ నాయకులు ఏకతాటి పైకి రావాలని చంద్రబాబు సూచించారు.  అంతేకాకుండా  పార్టీలో ఎమ్మెల్యే చేరికతో నియోజకవర్గ బాధ్యతలన్నీ ఆమె చేతుల్లోకి వెళతాయని కూడా వారికి ముందే చెప్పారని స‌మాచారం. ఇలా.. అన్ని విధాలా గిడ్డి ఆధిప‌త్యాన్ని బాబు పెంచేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు.  మొత్తంగా పార్టీని బ‌తికించుకోవ‌డం - వ‌చ్చే ఎన్నిక‌ల్లో గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో సైకిల్ ప‌రుగు పెట్టేలా చూడాల‌నే పెద్ద ప్ర‌ణాళిక‌తోనే చంద్ర‌బాబు గిడ్డికి కండువా క‌ప్పార‌న్న విష‌యం వెలుగు చూసింది. మ‌రి గిడ్డి ఏమేర‌కు క‌ష్ట‌ప‌డ‌తారో చూడాలి.
Tags:    

Similar News