మోడీ కౌగిలింత‌లో మ‌ర్మం ఇద‌ట‌

Update: 2016-01-27 13:41 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పాపుల‌ర్ నాయ‌కుల్లో ఒక‌రైన‌ మోడీ త‌న ఆహార్యాల‌తో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటారు. ఆయితే ఇపుడు అవే భంగిమ‌లు మోడీని హేళ‌న చేయ‌డానికి కార‌ణంగా మారుతున్నాయి. అదికూడా ఎవ‌రో దారిన పోయే దాన‌య్య కాదు...ప్ర‌పంచవ్యాప్తంగా పేరున్న మీడియా సంస్థ మోడీ ప‌రువును బ‌జారున ప‌డేసే ప్ర‌య‌త్నం చేసింది.

ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్ర‌తి ప‌ర్య‌ట‌న‌లోనూ ఆయా దేశాధినేత‌లను క‌లిసిన‌పుడు ఆత్మీయ అలింగ‌నం చేసుకుంటున్నారు. అయితే ఈ భార‌తీయ సంప్ర‌దాయంపై ఇపుడు వాషింగ్ట‌న్ పోస్ట్ త‌న‌దైన శైలిలో వ‌క్రీక‌ర‌ణ చేసింది. వివిధ దేశాధినేత‌ల‌ను క‌లిసిన‌పుడు మోడీ వారిని కౌగిలించుకున్న తీరును ప్ర‌స్తావిస్తూ ఇదేం విడ్డూరం అంటూ స‌న్నాయి నొక్కులు పోయింది. ఊరికే బుర‌ద‌ను త‌న‌పై ఎందుకు వేసుకోవాల‌ని అనుకుందో తెలియ‌దు కానీ మోడీ ఆలింగ‌న ఫొటోల‌పై ఫేస్‌ బుక్‌ లో పేలిన జోకులు, వచ్చిన విమ‌ర్శ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ వారిని త‌న క‌థ‌నాల్లో ట్యాగ్‌ లు పెట్టింది. ఇలా మోడీకి చెందిన ఫొటోలతో ఈ క‌థ‌నాన్ని నింపేసింది.

ఈ క్ర‌మంలోనే తాజాగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు వ‌చ్చిన ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌ ను మోడీ కౌగ‌లించుకున్న విధానాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. అనుకోకుండా మోడీని ఆయ‌న్ను వెన్నువైపు నుంచి ద‌గ్గ‌రికి తీసుకోవ‌డాన్ని చిలువ‌లు ప‌లువ‌లుగా చేసింది. టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్ సీన్‌ ను అది త‌ల‌పిస్తోంద‌ని చేసిన కామెంట్‌ ను అతికించింది. ఫ్రాన్స్‌ లో కౌగిలింత సంప్ర‌దాయ‌మే లేద‌ని పేర్కొంటూ ఈ మాత్రం అయినా తెలుసుకోకుండా ఎలా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌శ్నించింది.

అయితే భార‌తీయ సంప్ర‌దాయంలో భాగ‌మైన ఆత్మీయ ఆలింగ‌నాన్ని - దేశ ప్ర‌ధానిని ఉద్దేశిస్తూ ఈ విధ‌మైన క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం, మ‌నోభావాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఎందుక‌ని భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.
Tags:    

Similar News