రాష్ట్రాల్నిరియాక్ట్ అవ్వమన్న సుప్రీం

Update: 2017-03-28 04:49 GMT
దేశానికి వెన్నుముక లాంటి రైతులు ఆత్మహత్యలు చేసుకోవటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. రైతుల ఆత్మహత్యల్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాల మీద రాష్ట్రాల్నిరియాక్ట్ కావాలని ఆదేశించింది. ఇందుకు నెల రోజుల వ్యవధి ఇచ్చిన సుప్రీం.. ఆ లోపు నివేదిక సిద్ధం చేయమంది. ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని కేంద్రానికి ఇచ్చింది. రైతుల ఆత్మహత్యల అంశం చాలా తీవ్రమైన విషయంగా అభివర్ణించిన కోర్టు.. దీనిపై రాష్ట్రాలు స్పందించి..నివారించే సూచనలు.. సలహాలు ఇవ్వాలని కోరింది.

సిటిజన్స్ రిసోర్స్ అండ్ యాక్షన్.. ఇనిషియేటివ్ సంస్థ ఒకటి రైతుల ఆత్మహత్యలపై ఒక వ్యాజ్యాన్ని సుప్రీంలో దాఖలు చేసింది. దీనిపై కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహా వాదనలు వినిపించారు. ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయటం.. బీమా పరిధిని పెంచటం.. రుణ వితరణ.. పంట నష్టానికి పరిహారం.. లాంటివి రైతుల ఆత్మహత్యల్నినివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

అయితే.. ఆత్మహత్యల అంశం తీవ్రమైనదని.. ప్రాణాలు తీసుకునేంత తీవ్రమైన నిర్ణయాన్ని రైతులు ఎందుకు తీసుకుంటున్నారు?ఆత్మహత్యలకు మూలమైన సమస్యల్ని పరిష్కరించటంపై కేంద్రం  ఒక సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.నెల రోజుల వ్యవధిలో రాష్ట్రాలన్నీ ఈ అంశంపై రియాక్ట్ కావాలని కోరింది.  రైతుల ఆత్మహత్యలకు మూల కారణం కనుగొనాలని..దాని పరిష్కారం కోసం సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని కోరింది. మరి.. సుప్రీం ఆదేశాలకు రాష్ట్రాలు.. కేంద్రం ఎంతవరకు రియాక్ట్ అవుతాయో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News