టీ20 ప్రపంచ కప్ 2021లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్ పై గత బుధవారం హాఫ్ సెంచరీ బాదిన కేఎల్ రాహుల్, స్కాట్లాండ్ తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కేవలం 19 బంతుల్లోనే 6x4, 3x6 సాయంతో 50 పరుగులు చేశాడు. దీనితో 86 పరుగుల లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఛేదించేసిన టీమిండియా సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఛేదనలో రెండో ఓవర్ నుంచే భారీ షాట్లు ఆడేసిన కేఎల్ రాహుల్, వరుసగా ఫోర్లు, సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లని ఉతికారేశాడు.
సింగిల్ లేదా సిక్స్, ఫోర్ అనేంతలా ఆడేసిన కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ ని అందుకున్నాడు. అతనికి జోడీగా ఆడిన రోహిత్ శర్మ కూడా 16 బంతుల్లోనే 5x4, 1x6 సాయంతో 30 పరుగులు చేయడం విశేషం. టీ20 వరల్డ్ కప్స్ లో వేగంగా హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే, యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే ఇంగ్లాండ్ పై 2007లో అర్ధ శతకం నమోదు చేయగా స్టీఫెన్ (17 బంతుల్లో) ఐర్లాండ్ పై 2014లో, గ్లెన్ మాక్స్ వెల్ (18 బంతుల్లో) పాకిస్థాన్ పై 2014లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు బాదారు.
తాజాగా కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేయడం ద్వారా భారత్ తరఫున వేగంగా ఈ మార్క్‌ని అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ గౌతమ్ గంభీర్ 19 బంతుల్లో శ్రీలంకపై 2009లో హాఫ్ సెంచరీతో యువీ తర్వాత స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం +1.619 నెట్ రన్ రేట్ తో టీమిండియా మూడో స్ధానంలో నిలిచింది. అఫ్గాన్ + 1.481, న్యూజిలాండ్ +1.277 నెట్ రన్ రేట్ లతో ఉన్నాయ్.ఇక, టీమిండియా సెమీస్ కు వెళ్లాలంటే.. అఫ్గానిస్తాన్ కచ్చితంగా న్యూజిలాండ్ ను ఓడించాల్సిందే. ఇది గనుక జరిగితే.. టీమిండియా సెమీస్ వెళ్లడం చాలా ఈజీ. ఇప్పటికే టీమిండియా బెటర్ నెట్ రన్ రేట్ తో మెరుగైన స్థానంలో నిలిచింది.