రాష్ట్రపతి కుమార్తె వేదింపుల కేసులో కొత్త ట్విస్ట్!

Update: 2016-08-17 04:17 GMT

ఫేస్ బుక్ లో తనకు అసభ్యకర మెసేజ్ లు పెట్టాడని, ఆ విషయాన్ని లైట్ తీసుకుంటే ఏమాత్రం మంచింది కాదని, రాష్ట్రపతి కుమార్తెను వేదిస్తేనే లైట్ తీసుకుంది అని భావించి.. మరికొంతమందిపై ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉందని.. అతడు పంపిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి ప్రపంచానికి చూపించారు రాష్ట్రపతి కుమార్తె - ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షర్మిష్ఠ ముఖర్జీ. ఇది తెలిసిన విషయమే!! ఇక ఆ విషయం పోలీసులు చూసుకుంటున్నారులే అనుకున్న సమయంలో తాను ఎదుర్కొన్న ఆన్ లైన్ వేధింపులపై ఆమె మరోసారి స్పందించారు. ఈ కేసులో పార్థ మండల్ తనను వేదిస్తే.. అతడి తండ్రి ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారట.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తెను ఆన్ లైన్ లో అసభ్యకర మెసేజ్ లతో వేదించిన కేసులో నిందుతుడైన పార్థ మండల్ పరిస్థితిపై అతడి తండ్రి తాజాగా స్పందించారు. తన కుమారుడు మానసిక వ్యాధిగ్రస్తుడైనందునే ఇలా స్పందించాడని, ఈ విషయాన్ని గ్రహించి తన కొడుకును మన్నించాలని అభ్యర్థించారు. ఈ విషయాలను షర్మిష్ఠ వెల్లడించారు. మన్నింపుల సంగతి తర్వాత ముందు అతణ్ని పోలీసులకు లొంగిపోవాల్సిందిగా ఆమె సూచించారు.

"నన్ను వేధింపులకు గురిచేసిన పార్థా మండల్ తండ్రి నాకొక సందేశం పంపారు. 'నా కుమారుడి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున అతనికి చికిత్స చేయిస్తున్నాం. నా కుమారుడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను.. దయచేసి అతడిని మన్నించండి" అని పార్థ తండ్రి నాకు ఒక మెసేజ్ చేశారు. ఆ విషయంపై స్పందించి.. "వెంటనే మీ కుమారుణ్ని పోలీసులకు అప్పగించి - వైద్యపరీక్షలు చేయించండి. ఆ తర్వాత అతడు కావాలని చేశాడా లేక నిజంగానే మానసిక వ్యాదిగ్రస్తుడా అనే వాస్తవాలు అవే తెలుస్తాయి".. అని సమాధానం ఇచ్చినట్లు షర్మిష్ఠ తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.
Tags:    

Similar News