ఉద్యమనేతగా ప్రపంచ ప్రజలకు సుపరిచితుడు.. అగ్రరాజ్య దురహంకారంపై గళం విప్పిన నాయకుడు.. పోరాట యోథుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే విషయాలు ఉంటాయి ఫిడెల్ క్యాస్ట్రో గురించి. క్యూబాకు సుదీర్ఘ కాలం అధినేతగా వ్యవహరించిన ఆయన ప్రతి అడుగూ ఒక సంచలనంగా చెప్పాల్సిందే. తన విధానాలతో ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఆయన మరణం ప్రపంచానికి ఒక షాక్ లా మారిందనే చెప్పాలి. దగ్గరి దగ్గరి 650 సార్లు (కాస్త కచ్ఛితంగా చెప్పాలంటే 638సార్లు) ఒక వ్యక్తి మీదా హత్యాయత్నం జరిగినప్పటికీ.. ఆ కుట్రలు.. కుతంత్రాల నుంచి విజయవంతంగా బయట పడిన రియల్ జేమ్స్ బాండ్ కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశాల్ని చూస్తే..
ఉక్కు మహిళగా అభివర్ణించే దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి క్యాస్ట్రో ఇచ్చిన ఆత్మీయ షాక్ గురించి చెప్పాల్సిందే. అలీనోద్యమం జోరుగా సాగుతున్న వేళ.. ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా ఢిల్లీ నిలిచింది. ఈ సదస్సుకు వందకు పైగా దేశాధినేతలు.. పరిశీలకులు హాజరయ్యారు. ఇలాంటి వేళ.. అప్పటివరకూ అలీనోద్యమానికి ఛైర్మన్ గా వ్యవహరించిన క్యాస్ట్రో.. తన తర్వాత అధ్యక్ష బాధ్యతల్ని ఇందిరకు అప్పగించాల్సి ఉంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష బాధ్యతల్ని తన సోదరికి అందించటం ఆనందంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న సుత్తి(అదేనండి కోర్టులలో జడ్జిల దగ్గర ఉంటుంది చూశారు కలప సుత్తి. అలాంటిదే)ని ఇందిరకు ఆయన ఇవ్వాల్సి ఉంటంది. దాన్ని అందుకునేందుకు వేదిక మీద ఉన్న ఇందిరమ్మ.. క్యాస్టో వద్దకు వెళ్లారు. చేయి జాచారు. కానీ.. క్యాస్ట్రో మాత్రం సుత్తి ఇవ్వలేదు. దీంతో.. సెకన్లు కాస్తా నిమిషాల మాదిరి భారంగా కదులుతున్నాయి. ఆ సందర్భంలో ఇందిరకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
అలాంటి సమయంలో.. క్యాస్ట్రో చిరునవ్వుతో హటాత్తుగా ముందుకు కదిలిన ఆయన.. తన రెండు చేతులతో ఇందిరమ్మను గట్టిగా ఆలింగనం చేసుకోవటంతో ఆమె ఒక్కసారి షాక్ కి గురయ్యారు. వెంటనే తేరుకొని చిరునవ్వులు చిందించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్న క్యాస్ట్రో.. అనంతరం తన సోదరికి ‘సుత్తి’ని ఇచ్చారు. దీంతో.. సదస్సు మొత్తం చప్పట్లో మారుమోగింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక ఉద్యమ నేత.. ఇందిరమ్మ విషయంలో వ్యవహరించిన వైఖరి అక్కడి వారినే కాదు.. అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఇందిరమ్మ సామర్థ్యం ఏమిటన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/