క‌ర‌ణం.. గొట్టిపాటి చొక్కాలు పట్టుకొని..

Update: 2017-05-23 14:09 GMT
ఏపీ అధికార‌ప‌క్షంలో వ‌ర్గ‌పోరు బ‌ద్ధ‌లైంది. ప్ర‌కాశం జిల్లా టీడీపీ అధ్య‌క్ష ఎన్నికను ఒంగోలు ఏ1 ఫంక్ష‌న్ హాల్లో జ‌రిగింది. మ‌హానాడుకు ముందుగా జరుగుతున్న జిల్లా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ప‌రిశీల‌కులుగా వ‌చ్చిన మంత్రి నారాయ‌ణ‌.. ప‌రిటాల సునీత‌.. శిద్దా రాఘ‌వ‌రావులకు షాకిస్తూ.. క‌ర‌ణం.. గొట్టిపాటి వ‌ర్గాలు బాహాబాహీకి త‌ల‌ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది.

కార్య‌క‌ర్త‌లే కాదు.. స్వ‌యంగా క‌ర‌ణం బ‌ల‌రాం.. గొట్టిపాటి ర‌వికుమార్ లు ఇద్ద‌రూ ఒక‌రిని ఒక‌రు తోసేసుకున్న వైనంతో అక్క‌డ ఉద్రిక్త‌త‌లు పీక్స్ కు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాలు ఉన్నప్ప‌టికీ ఇరువ‌ర్గాల వారిని కంట్రోల్ చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఒక‌వేళ పోలీసులు లేకుంటే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఊహించేందుకు సైతం భ‌యంగా ఉంద‌న్న మాట టీడీపీ వ‌ర్గాల నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

అధ్య‌క్ష ఎన్నిక‌ల కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ చొక్కా ప‌ట్టుకొని బ‌ల‌రాం వ‌ర్గీయులు లాగ‌టంతో గొడ‌వ ప్రారంభ‌మైన‌ట్లు చెబుతున్నారు. ఒక్క‌సారిగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌తో గొట్టిపాటి వ‌ర్గీయులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య అరుపులు.. కేక‌లు.. తోపులాట‌ల‌తో తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి చోటు చేసుకుంది. ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ద‌శ‌లో గొట్టిపాటి చొక్కా చిరిగిపోయింది. మ‌రో స‌మ‌యంలో ఆయ‌న కింద ప‌డినంత ప‌నైంది.

ఇరువ‌ర్గాల్ని వేర్వేరు చేసేంత‌లో ఉన్న‌ట్లుండి బ‌ల‌రాం.. గొట్టిపాటి ఎదురెదురుగా రావ‌టం.. గొట్టిపాటిని బ‌ల‌రాం నెట్ట‌టంతో ప‌రిస్థితి మ‌రింత విష‌మించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. బ‌ల‌రాం వ‌ర్గీయులు మాత్రం ఈ వాద‌న‌ను కొట్టిపారేస్తున్నారు. క‌ర‌ణం.. గొట్టిపాటిలు ఇద్ద‌రు స్వ‌యంగా త‌ల‌ప‌డ‌టంతో ఏపీ అధికార ప‌క్షంలో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

ఎన్ని విభేదాలు ఉన్నా.. అంత‌ర్గ‌త పోరు ఉన్నా.. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు ఇద్ద‌రు ఇలా బాహాటంగా బాహాబాహీకి దిగ‌టం హాట్ టాపిక్ గా మారింది. గొట్టిపాటి వ‌ర్గీయులే త‌మ‌ను రెచ్చ‌గొట్టిన‌ట్లుగా క‌ర‌ణం బ‌ల‌రాం వ్యాఖ్యానిస్తూ.. ఎవ‌రినీ రెచ్చ‌గొట్టాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్నారు. గొట్టిపాటి త‌న ప‌ని తాను చూసుకుంటే మంచిద‌న్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై గొట్టిపాటి ర‌వికుమార్‌.. ఈ రోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. త‌మ్ముళ్లు ఈ విధంగా చెల‌రేగిపోతున్న వైనానికి బాబు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. క‌ట్టుత‌ప్పిన త‌మ్ముళ్ల‌ను కంట్రోల్ చేయ‌కుంటే మొద‌టికే మోసం రావ‌టం ఖాయ‌మ‌న్న మాట ఏపీ అధికార‌ప‌క్షంలో వినిపిస్తోంది.


Tags:    

Similar News