భారత్-రష్యా మధ్య రక్షణ బంధం కుదిరింది. భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడితో ప్రధాని నరేంద్రమోడీ నాలుగు ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ఒప్పందం చేసుకుంటే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అయినా ఆ ఆంక్షలను తోసిరాజని భారత్ రష్యాతో రక్షణ బంధం ఏర్పరుచుకుంది. అయితే ఈ చారిత్రక ఒప్పందంపై అమెరికా అగ్రశ్రేణి మీడియా రకరకాలుగా విశ్లేషిస్తూ కథనాలు ప్రచురించాయి.
ఇప్పటికే అమెరికా.. తన శత్రుదేశంగా రష్యాను భావిస్తోంది. అలాంటి రష్యాతో సత్సబంధాలు నెరిపిన భారత్ పై ఆంక్షలు విధించేందుకు ఇప్పుడు క్యాట్సా చట్టాన్ని అమెరికా ప్రయోగిస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారిందట.. రష్యాతో చెలిమి చేసిన దేశాలపై ఈ చట్టాన్ని అమెరికా ప్రయోగించేది. ఆంక్షలు విధించేది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన ఆంక్షల్ని తొలగిస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. గత సెప్టెంబర్ లో రష్యా నుంచి ఆయుధాలు కొన్న చైనా పై కూడా అమెరికా ఇలానే ఆంక్షలు విధించడం గమనార్హం.
తాజాగా చైనా దేశం.. భారత్-అమెరికా ఉమ్మడి శత్రువు.. అమెరికా-భారత్ ల మధ్య బంధం మరింత బలపడడానికి అమెరికా చూస్తుండగా.. రష్యా వైపు భారత్ మల్లడంపై అమెరికా జీర్నించుకోలేకపోతోందని ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనం ప్రచురించింది. ఈ క్రమంలోనే అమెరికాకు ఏం చేయాలో తెలియడం లేదని రాసుకొచ్చింది. అమెరికా వైపు నుంచి రష్యాతో దోస్తీ చేసిన దేశాల వెలి సరైనదే అయినా రష్యా మీద కోపం మరో దేశం మీద ప్రదర్శించకూడడని అమెరికాలో మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డట్టు వాషింగ్టన్ పోస్టు రాసుకొచ్చింది.