తమిళనాడులో రాజకీయం అంతకంతకూ వేడెక్కిపోతోంది. నిన్నమొన్నటి వరకూ అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభంతో తరచూ వార్తల్లోకి వచ్చిన తమిళనాడు రాజకీయం.. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న మాటతో పరిస్థితి మొత్తం మారిపోతోంది.
రజనీ కాంత్ కానీ రాజకీయాల్లోకి వస్తుంటే.. తాము ఆయన పార్టీలోకి రావటానికి సిద్ధమంటూ పలువురు నేతలు ఇప్పటికే సందేశాలు పంపుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అధికార పక్షానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రజనీ సోదరుడికి సానుకూల సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది.
రజనీ ఓకే అన్న మాట చెబితే చాలు.. ఐదుగురం వచ్చేస్తామన్న విషయాన్ని తాజాగా రజనీకి సందేశ రూపంలో పంపినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పార్టీలోకి వచ్చేస్తామని చెప్పటమే కాదు.. తమ మీద ఇప్పటివరకూ ఎలాంటి సివిల్.. క్రిమినల్ కేసులు లేవన్న విషయాన్ని కూడా ప్రత్యేకించి తమ సందేశంలో ఫోకస్ అయ్యేలా ఉంచటం గమనార్హం.
అధికారపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రజనీ పార్టీ పెడితే జంప్ కావటానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి బలం చేకూరేలా తాజా ఉదంతం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరి.. ఇలాంటి జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో తలైవా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/