ఉత్కంఠ వీడిపోయింది. ఎవరి బలం ఎంతన్న క్లారిటీ వచ్చేసింది. సుదీర్ఘంగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చేశాయి. ఈ రోజు (శనివారం) ఉదయం8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తంగా పూర్తిఅయ్యింది. అన్ని స్థానాల్ని అధికారికంగా ప్రకటించేశారు. ఓట్ల లెక్కింపు మొదలైన గంటకే తుది ఫలితాలపై రేఖామాత్రంగా ఐడియా వచ్చసింది. కౌంటింగ్ షురూ అయిన 150 నిమిషాల వ్యవధిలోనే.. విజేతలు ఎవరు? పరాజితలు ఎవరన్న విషయంపై క్లారిటీ గా తేలిపోయింది. అయితే.. మధ్యాహ్నం 2 గంటల వేళలో మాత్రమే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితం యావత్ దేశానికి సంచలనంగా మారింది.
తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాన్ని రాష్ట్రాల వారీగా చూస్తే..
ఉత్తరప్రదేశ్..
మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా.. బీజేపీకి 325 అసెంబ్లీ స్థానాల్ని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అధికార సమాజ్ వాదీకి ఊహించని భారీషాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో అధికార సమాజ్ వాదీ పార్టీ చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందం ఏ మాత్రం వర్క్వుట్ కాకపోవటమే కాదు.. కోలుకోలేని రీతిలో పరాజయం షాక్ తగిలిందని చెప్పాలి. సమాజ్ వాదీతో పోలిస్తే.. కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందని చెప్పాలి. గతఎన్నికల సమయంలో దాదాపు 28 స్థానాల్లో సొంతంగా విజయం సాధించగా.. తాజా పొత్తు సందర్భంగా ఏడంటే..ఏడు స్థానాల్లో మాత్రమే గెలవటంఇప్పుడా పార్టీకి షాకింగ్ మారింది. సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకొని బరిలోకి నిలిచిన వైనంతో భారీప్రయోజనం పొందుతామనుకున్న దానికి భిన్నంగా.. భారీ షాక్ తగిలిందని చెప్పక తప్పదు.
ఇక.. అధికార సమాజ్ వాదీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఐదేళ్ల క్రితం (2012) జరిగిన ఎన్నికల్లో 224 స్థానాల్లో విజయం సాధించి..పవర్ లోకి వచ్చిన సమాజ్ వాదీకి..తాజా ఎన్నికల్లో 47 స్థానాలకు మాత్రమే పరిమితం కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో కొద్దొగొప్పొ బలాన్ని ప్రదర్శించిన బీఎస్పీ పరిస్థితి దయనీయగా మారింది. ఈసారి ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయంసాధించింది. ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు.
ఇక..ఉత్తరాఖండ్ విషయానికి వస్తే..
మొత్తం 70 స్థానాలున్న ఈ బుడ్డరాష్ట్రంలో బీజేపీ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. ఆ పార్టీకి 57 స్థానాల్లో విజయం సాధించటం విశేషంగా చెప్పలి. అధికార కాంగ్రెస్ కు కేవలం11 స్థానాలే విజయం సాధించింది. ఇతరులు మరో రెండు స్థానాల్లో విజయాన్ని నమోదు చేసుకున్నారు. ముందుగా వెలువడుతున్నఅంచనాలకు తగ్గట్లే బీజేపీ ఘనవిజయాన్ని సాధించింది. ఇతరులు రెండుస్థానాల్లో విజయం సాధించారు.
రాహుల్ అండ్ కోకు భారీ ఊరట ఇచ్చిన పంజాబ్..
కాంగ్రెస్ కు భారీ ఊరట ఇచ్చిన పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దఫాల నుంచి వరుసగా పవర్ లో ఉన్న శిరోమణి అకాలీదళ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకున్న బీజేపీకి పంజాబీలు తమకున్నఆగ్రహాన్ని ప్రదర్శించి. మోడీ పరివారానికి దిమ్మ తిరిగే తీర్పును ఇచ్చారు అన్ని సర్వేసంస్థలు చెప్పినట్లుగానే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయం ఎలా సాధ్యమైనదో..అదే రీతిలో పంజాబీలు కాంగ్రెస్ కు అధికారపగ్గాలుఅప్పజెప్పారని చెప్పాలి. అకాలీలతో జతకట్టిన బీజేపీతో పంజాబీలు విసిగిపోయి..కాంగ్రెస్ నుఅక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తర్వాత.. కేజ్రీ వాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీపార్టీకి 20 స్థానాల్ని సొంతం చేసుకున్నారు.ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదేనని ఫీలైన కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. ఇక..అధికార శిరోమణి..బీజేపీలు కేవలం 18 స్థానాలకే పరిమితమైన వైనం చూస్తే..పదేళ్ల వారి పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్నది ఇట్టేఅర్థమవుతుంది.
గోవాలో హస్తానికే అధిక్యమైనా..
అధికార బీజేపీకి గోవాలో భారీ షాక్ తగిలింది.మొత్తం 40 స్థానాలున్న గోవాలో అధికార బీజేపీ కేవలం13 స్థానాలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించారు. ఇక..మిగిలింది 10 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కటంటే.. ఒక్కఅసెంబ్లీ నియోజకవర్గంలోనూ విజయం సాధించలేకపోయింది.
మణిపూర్ లోనూ అధిక్యం ‘హస్తం’దే
పేరుకు చిన్న రాష్ట్రమైన మణిపూర్ లో 60అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్28 స్థానాల్లో పాగా వేయగా..బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్డీఎఫ్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. ఇతరులు7 స్థానాల్లో గెలుపొందారు. యూపీ గెలుపు ఇచ్చిన కిక్ లో.. యూపీ..ఉత్తరాఖండ్ తో పాటు.. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లోనూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అమిత్ షా మాటల్ని చూస్తే.. మణిపూర్.. గోవాలలో కమలనాథులు ప్రభుత్వాన్నిఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారన్న భావన కలగటం ఖాయం.
ఈఎన్నికల ఫలితాల్నిచూస్తే.. అధికారపక్షాల మీద ఓటర్లకున్న అసంతృప్తి ఇట్టే కనిపించింది. అదే సమయంలో కులాలు..మతాలు ఓటర్లపై పెద్ద ప్ర భావాన్ని చూపించినట్లుగా చెప్పాలి. పెద్ద నోట్లరద్దు నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని కన్ఫర్మ్ అయ్యింది. మొత్తంగా మోడీ పాలనపట్ల ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్ ఉందన్నది మరోసారి రుజువైందని చెప్పకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/