ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ - పంజాబ్ - మణిపూర్ - గోవా శాసనసభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయింది. మరికాసేపట్లో వెలువడనున్నాయి. యావత్ దేశం ఈ ఐదు రాష్ర్టాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఈ ఐదు రాష్ర్టాల్లో ఎవరికీ మెజార్టీ వస్తదో మరికాసేపట్లో తేలనుంది. లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషేందించారు. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. దీని కోసం 75 జిల్లాల్లో 78 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తరఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎన్నికల సంఘం మొత్తం 15 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మణిపూర్ లో మొత్తం 60 నియోజకవర్గాలకు - పంజాబ్ లో 117 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. పంజాబ్ లో 27 చోట్ల 54 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాగా, 403 స్థానాలున్న యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202 - 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 36 - 117 స్థానాలున్న పంజాబ్ లో మ్యాజిక్ ఫిగర్ 59 - 60 స్థానాలున్న మణిపూర్ లో మ్యాజిక్ ఫిగర్ 31 - 40 స్థానాలున్న గోవాలో మ్యాజిక్ ఫిగర్ 21. యూపీలో బీజేపీ - ఎస్పీ మధ్య పోటాపోటీ నెలకొంది. పంజాబ్ లో కాంగ్రెస్ - ఆమ్ ఆద్మీ పార్టీ - ఉత్తరాఖండ్ లో బీజేపీ - కాంగ్రెస్ - మణిపూర్ లో కాంగ్రెస్ - గోవాలో బీజేపీ అధిక్యంలో ఉంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్తోంది. అటు పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ - ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
- ఎస్పీ - కాంగ్రెస్ కూటమి కంటే రెట్టింపు ఆధిక్యంలో బీజేపీ ఉండటం గమనార్హం
- ప్రస్తుతం యూపీలో 156 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.
ఉత్తరాఖండ్ లో స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ ముందంజలో ఉంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ 44 స్థానాల్లో లీడ్ లో ఉండగా - 22 స్థానాలతో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ముందుకెళ్తున్నది. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ 36. ఒకట్రెండు గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడున్నాయి. లీడ్ లో ఉన్న బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. తమదే గెలుపు అంటూ విజయ ఢంకా మోగిస్తున్నది కమలం పార్టీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/