ఒక మానవ మృగానికి 885 ఏళ్ల జైలుశిక్షను వేసింది అమెరికాలోని ఒక కోర్టు. అన్నేసి శతాబ్దాలు జైలు శిక్ష వేయటానికి కారణం ఏమిటి? ఆ దుర్మార్గుడు అంత దారుణమైన నేరాలు ఏం చేశాడు? అన్న విషయాల్లోకి వెళితే.. విస్మయంతో నోట మాట రాదు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 32 ఏళ్ల షాన్ ర్యాన్ థామస్ విపరీతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. చిన్నపిల్లల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంటాడు.
చిన్నారులకు మాయమాటలు చెప్పటం.. వారితో బలవంతంగా సెక్స్ చేయటం.. ఆ దారుణాన్ని వీడియో రూపంలో ఆన్ లైన్ లోకి అప్ లోడ్ చేయటం లాంటివి చేస్తుంటాడు. ఇలా ఛైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇతగాడి మీద ఇప్పటికే పలు నేరాలు నమోదయ్యాయి. అయితే.. ఈ మధ్యన అతడు మరింత దారుణానికి పాల్పడ్డాడు. తనను తాను ఒక సినిమా వ్యక్తిగా పరిచయం చేసుకొని.. మాట్లాడుకోవటం కోసం ఓ తొమ్మిదేళ్ల బాలికను.. వారి తల్లిదండ్రుల్ని తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు.
ఇతగాడి విపరీత మనస్తత్వాన్ని అంచనా వేయలేని వారు.. ఇంటికి వెళ్లారు. అయితే.. థామస్ ఆలోచనలు వేరు. తొమ్మిదేళ్ల చిన్నారి.. వారి తల్లిదండ్రులు ఇంటికి రాగానే.. వారిని చంపేసి.. చిన్నారిని రేప్ చేసి చంపేయాలన్నది అతడి ప్లాన్. అయితే.. ఇతడి వ్యవహారశైలి సందేహంగా ఉండటంతో.. ఇతడి గురించి పోలీసులకు సమాచారం అందించాడు పక్కింటాయన. ఈ ఇంటి మీద దాడి చేసి థామస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి 70కు పైగా ఛైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు బయటపడ్డాయి. ఇప్పటికే అతని మీదున్న 59 కేసులకు.. ఒక్కో కేసుకు 15 ఏళ్లు చొప్పున మొత్తం 885 ఏళ్ల జైలు శిక్ష (బతికున్నంత కాలం జైలే) విధించారు. మరికొన్ని కేసులు విచారణకు రావాల్సి ఉంది.