అమెరికాలో భారతీయుల ఆస్తులపైనా దాడులు

Update: 2017-03-12 07:30 GMT
అమెరికాలో భారతీయులపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.  శ్రీనివాస్ కూఛిబొట్ల హత్యానంతరం మరో ఎన్నారైపై దాడి జరగగా, తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. రిచర్డ్ లాయిడ్ (64) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
    
ఇప్పటికే భారతీయులపై భౌతిక దాడులు - హత్యలు జరుగుతుండగా.. తాజాగా మనవాళ్ల ఆస్తులను కూడా ధ్వంసం చేయడం ఆందోళన కలిగిస్తోంది.  కాగా తాజాగా చేసిన దారునంలో రిచర్డ్ లాయిడ్ అక్కడి భారతీయుడి స్టోర్ కి బహిరంగంగానే నిప్పు పెట్టి అక్కడే నిల్చుని చేతులు  వెనక్కి పెట్టుకొని దర్జాగా నవ్వుతూ పోజులిచ్చాడట. అంతేకాదు.. తాను చేసిన పనికి తనను అరెస్టు చేసుకోవాలంటే పోలీసులకు సవాల్ విసిరాడట.  తమ దేశంలో అరబ్‌ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దంటూ నినాదాలు కూడా చేశాడట.
    
అయితే.. ఆ తరువాత పోలీసులు అరెస్టు చేయగా నేరాన్ని అంగీకరించాడు. అయితే..  తాను పొరపాటున ఈ స్టోర్ తగలబెట్టానని.. అరబ్ దేశాలవాళ్లదని అనుకుని ఆ పనిచేశానని.. భారతీయులదని తనకు తెలియదని చెప్పాడు.  తన లక్ష్యం భారతీయులు కాదని చెప్పాడు. కాగా, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరచగా 30 వేల డాలర్లు బాండ్ సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News