ప్రాణాలు పోతున్నా మారని అమెరికన్ల తీరు!

Update: 2020-04-19 13:30 GMT
చింత చచ్చినా పులుపు చావదు అన్న చందంగా ఉంది అమెరికన్ల పరిస్థితి. ఓ వైపు కరోనాతో ఏడున్నర లక్షల మందికి కరోనా సోకి 36వేల మంది చనిపోయినా కరోనా అంటే కించత్ భయం లేకుండా విచ్చలవిడిగా విహారాలు చేస్తున్న దృశ్యాలు అమెరికాలో కనిపిస్తున్నాయి. ప్రాణాలు పోతున్నా మారని అమెరికన్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ప్రస్తుతం కరోనాతో అమెరికాలో లాక్ డౌన్ విధించారు. కొద్దిరోజుల వరకు ప్రజలు తమ ఇళ్ల నుంచి  బయటకు రాకుండా నిషేధించారు. అయితే ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేలోని ప్రజలు బీచ్ లకు పెద్ద ఎత్తున తరలిరావడం కలకలం రేపింది. కనీసం మాస్కులు - గ్లౌజులు లేకుండా సామూహికంగా గుంపులుగా వీరు తిరిగడం చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు.

  ఉదయం మరియు సాయంత్రం ప్రజల కోసం బీచ్‌ లు కొన్ని గంటల పాటు అధికారులు తెరుస్తున్నాయి. అయితే సామాజిక దూరాన్ని పాటించాలని ఆంక్షలను విధించారు.  దాన్ని ఎవరూ పాటించకుండా ప్రజలు బీచ్‌ లకు పోటెత్తారు. రద్దీగా పిచ్చెక్కినట్లు తిరుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా  విచ్చలవిడిగా ఆటలు ఆడుతున్నారు.   బీచ్‌ వద్ద  ప్రజలు అరవడం.. ఉత్సాహంగా తిరగడం..  సంతోషంగా ఒకరినొకరు హగ్గులు చేసుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కరోనా భయం లేకుండా వీరంతా ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

 ఫ్లోరిడాలో శుక్రవారం 1400 కొత్త కేసులు నమోదయ్యాయి.  కరోనావైరస్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. అయినా జనంలో మార్పు రాకపోవడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

   

Tags:    

Similar News