తెలంగాణలో తొలిసారి ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు..

Update: 2022-11-29 12:35 GMT
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇన్నాళ్లు  మేల్ లేదా ఫిమేల్ అభ్యర్థులే అర్హులుగా ఉండేవారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చిన ట్రాన్స్ జెండర్ల కాలం ఉండేది కాదు. దీంతో అయితే స్త్రీ కోటా.. లేదంటే పురుషుల కోటాలోనే అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేవి. అయితే తొలిసారి తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సంచలనం సృష్టించారు. ఇదో కొత్త చరిత్ర అని చెప్పొచ్చు.

స్వతహాగా డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి చరిత్ర సృష్టించారు.  వాళ్లిద్దరూ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్ గా నియమితులయ్యారు. ఇది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చారిత్రక విజయం అని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది.

2018లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా తనను డాక్టర్ గా తీసుకోవడానికి హైదరాబాద్ లోని 15 ఆస్పత్రులు నన్ను తిరస్కరించాయని రూత్ జాన్ పాల్ చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం రావడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇక ప్రాచీ రాథోడ్ కూడా ఎన్నో పరాభావాలను ఎదుర్కొంది. తాను ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ట్రాన్స్ జెండర్ అని ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగంలోంచి తీసేశారని.. నాలాంటి వారు ఉంటే ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతుందని తిరస్కరించారని ప్రాచీ వాపోయింది.

రెండేళ్లుగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని.. వ్యక్తిగత సమస్యలతోపాటు సామాజిక వివక్ష కూడా ఎదుర్కొన్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు తాము చాలా గర్వపడుతున్నామన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News