కరోనాకు కాదు ఎవరూ అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి మొదలు పెడితే.. రాష్ట్రాల సీఎంలు, మంత్రుల వరకూ అందరికీ కరోనా సోకింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజు 95వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.దేశంలో కరోనా జెట్ స్పీడుగా దూసుకెళుతోంది.
తాజాగా గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ (92) కరోనా బారినపడ్డారు. రాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని.. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం సిటీ స్కాన్ తోపాటు ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా కేశుభాయ్ కు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. కేశూభాయ్ కు గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్ ఉండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ సీఎం కాకముందే కేశుభాయ్ సీఎంగా ఉండేవారు. తదనంతరం ఆయన తర్వాత మోడీ పగ్గాలు చేపట్టి సీఎంగా నిరూపించుకొని ఇప్పుడు ఏకంగా ప్రధాని అయ్యారు.