లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను విపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ కుమార్తె అయిన మీరాకుమార్ 2009-14 మధ్య లోక్ సభ సభాపతిగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు పోటీగా ప్రతిపక్షాలు దళిత మహిళ మీరాకుమార్ ను తమ అభ్యర్థిగా బిహార్ కు చెందిన మీరాకుమార్ ను ప్రకటించాయి.
పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన విపక్ష పార్టీల కీలక భేటీ ముగిసింది. ఈ భేటీకి మన్మోహన్ సింగ్ - సీతారం ఏచూరి - సురవరం సుధాకర్ రెడ్డి - రాంగోపాల్ యాదవ్ - శరద్ పవార్ - కనిమొళి - ఇతర నేతలు హాజరయ్యారు. డార్జిలింగ్ లో ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కానట్లుగా సమాచారం.
మీరాకుమార్ విశేషాలు ఇవి
- మీరా కుమార్ 1945లో బీహార్ లోని పాట్నాలో జన్మించారు
- ఎంఏ - ఎల్ ఎల్ బీ డిగ్రీలతోపాటు స్పానిష్ భాషలో అడ్వాన్స్‌డ్ డిప్లమా చేశారు
- కోవింద్ లాగే మీరా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి
- మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమార్
- 1973లో మీరా ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో చేరారు
- ఆమె లండన్ లోని ఇండియన్ హైకమిషన్ లో పనిచేశారు. 1980 నుంచి 85 వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ సేవలందించారు
- 1985లో మీరాకుమార్ లోక్ సభకు ఎన్నికయ్యారు
- ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికవడమే కాదు తొలి మహిళా స్పీకర్ కూడా మీరాకుమారే
- రాజకీయాలే కాకుండా మానవ హక్కులు, సామాజిక సంస్కరణలకు సంబంధించిన ఉద్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు
- మీరాకుమార్ భర్త పేరు మంజుల్ కుమార్.. వీరికి నలుగురు పిల్లలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/