టీం ఇండియా ఓటమిపై పాక్‌ మాజీ పేసర్‌ అక్తర్‌ కామెంట్స్‌

Update: 2019-07-12 06:36 GMT
ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 సెమీస్‌ లోకి నెం.1 స్థానంతో దూసుకు వెళ్లిన టీం ఇండియా న్యూజిలాండ్‌ తో జరిగిన సెమీస్‌ పోరులో అనూహ్య పరిణామాల మద్య ఓటమిని చవి చూసిన విషయం తెల్సిందే. వన్డే కాస్త టూడే అయ్యింది, అంపైర్‌ తప్పిదాలు ఇంకా పలు కారణాల వల్ల అద్బుత పోరాట పటిమ కనబర్చినా కూడా టీం ఇండియా ఓటమి పాలయ్యింది. సెమీస్‌ పోరులో టాప్‌ ఆర్డర్‌ విఫలం అయినా కూడా జడేజా మరియు ధోనీలు వీరోచిత పోరాటం చేసి గెలుపుపై ఆశలు కల్పించారు. కాని వారిద్దరు చివర్లో ఔట్‌ అవ్వడంతో ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల గుండెలు పగిలినంత పనైంది. కేవలం ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు మాత్రమే కాకుండా పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కొందరు ఈ ఓటమిపై విచారం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

తాజాగా పాకిస్తాన్‌ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందిస్తూ.. రోహిత్‌ శర్మ ఒక అద్బుతమైన బంతికి ఔట్‌ అయ్యాడు. కోహ్లీ మాత్రం అంపైర్‌ తప్పుడు నిర్ణయం వల్ల వెనుదిరగాల్సి వచ్చింది. టాపార్డర్‌ నుండి లోయర్‌ ఆర్డర్‌ వరకు అంతా కూడా సాధారణ బంతికే ఔట్‌ అయ్యారంటూ విమర్శలు చేశాడు. మామూలు బాల్స్‌ కు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ మన్‌ వికెట్‌ ను సమర్పించుకున్నా కూడా జడేజా బాగా ఆడాడు. జడేజా మాదిరిగా టీం ఇండియా బ్యాట్స్‌ మన్‌ లలో ఎవరు కూడా ధైర్యంగా ఆడలేక పోయారంటూ టాపర్డార్‌ బ్యాట్స్‌ మన్‌ పై షోయబ్‌ అక్తర్‌ విమర్శలు గుప్పించాడు. ధోనీ కూడా బాగానే ట్రై చేశాడు. కాని ఆయన రనౌట్‌ ను ఎవరూ ఊహించలేదు. ధోనీ ఔట్‌ కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇండియాకు అనుకూలించేదని షోయబ్‌ మాలిక్‌ అభిప్రాయ పడ్డాడు. పలు మాజీలది ఇదే మాట.

Tags:    

Similar News