బిర్యానీ ఆర్డ‌ర్ చేసినందుకు రూ.40వేలు పోగొట్టుకుంది

Update: 2019-07-05 10:06 GMT
ఆన్ లైన్ లో హైద‌రాబాద్ బిర్యానీ ఆర్డ‌ర్ చేసిన పాపానికి ఒక మ‌హిళ‌కు జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు. వేలాది రూపాయిలు పోగొట్టుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. చెన్నైలోని సౌకార్ పేట‌కు చెందిన 21 ఏళ్ల ప్రియా అగ‌ర్వాల్ ఉబ‌ర్ ఈట్స్ కు  ఆన్ లైన్లో హైద‌రాబాద్ బిర్యానీ ఆర్డ‌ర్ చేశారు. దాని విలువ రూ.76 మాత్ర‌మే. ఆ మొత్తాన్ని ఆమె ఆన్ లైన్ లో చెల్లించారు. ఇక్క‌డి నుంచి ఆమెకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆమె చేసిన ఆర్డ‌ర్ కాన్సిల్ అయ్యింది. దీంతో.. ఆమె ఊబ‌ర్ ఈట్స్ కాల్ సెంట‌ర్ కు ఫోన్ చేశారు.

ఆమె ఫోన్ కు స్పందించిన వారు.. రూ.5వేలు ఆన్ లైన్  ఖాతాలో జ‌మ చేయాల‌ని.. దాంతో ఆమె రూ.5,076 మొత్తాన్ని ట్రాన్స‌ఫ‌ర్ చేశారు. అయినా డ‌బ్బులు వెన‌క్కి రాలేదు. దీంతో.. మ‌రోసారి మ‌రో రూ.5వేలు..ఇలా మొత్తం ఎనిమిది సార్లు రూ.40వేలు ట్రాన్స‌ఫ‌ర్ చేసినా బిర్యానీ రాలేదు.. ఆమెకు రావాల్సిన రూ.76 రాలేదు. బిర్యానీ కోసం తాను చెల్లించిన రూ.72 కోసం ఆమె చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోగా.. మొత్తంగా రూ.40,076 మొత్తాన్ని కోల్పోయారు. దీంతో.. తాను మోస‌పోయిన‌ట్లు గుర్తించిన ఆమె సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు ఈ మోసం ఎలా జ‌రిగిందో క‌నుగొనే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News