రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచమే అతలాకుతలం అవుతోంది. రష్యా చర్యలను చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అమెరికా అయితే రష్యాను ఏకాకిగా చేయాలని కంకణం కట్టుకుంది. అన్ని దేశాలు ముక్తకంఠంతో నిలదీయాలని డిమాండ్ చేస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి ఉక్రెయిన్ ముప్పేట దాడి చేస్తూ ముప్పతిప్పలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు సమకూర్చేందుకు ఫ్రాన్స్, ఇటలీ, ఫ్రెంచ్ దేశాలు ముందుకు వస్తున్నాయి. పోలెండ్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉక్రెయిన్ దళాలకు మిసైల్, యుద్ధ ట్యాంకులు అందజేస్తున్నాయి.
భారీ సాయుధ దళాలను లక్ష్యంగా చేసుకుని పట్టణాలు, నగరాలను ధ్వంసం చేసేందుకు రష్యా దూకుడుగా వెళ్తోంది. దీన్ని ఉక్రియిన్ కూడా సమర్థవంతంగానే అడ్డుకుంటోంది. ఉక్రెయిన్ లోని అణు రియాక్టర్ ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన రష్యాసేనలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా దాడిని ఎదుర్కొనేందుకు రెడీగానే ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రకటిస్తోంది.
ఉక్రెయిన్ కు ఫ్రాన్స్ , ఇటలీ ఆయుధాలు అందజేస్తోంది. దీంతో రష్యా దాడులను తిప్పికొడుతోంది. ఇదే సమయంలో రష్యాకు సైతం ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రష్యా ప్రయోగించే మిస్సైల్స్, యుద్ధ క్షిపణులను సైతం ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్ కూడా పోరాడుతోంది. ప్రత్యేకంగా యుద్ధాలు చేసే విమనాలను సైతం సమకూర్చుకుంటోంది.
రష్యా, ఉక్రెయిన్ లోని ముఖ్యనగరాలను టార్గెట్ చేసుకుంటోంది. వాటిపై క్షిపణి దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఉక్రెయిన్ కూడా సమర్థంగా ఎదుర్కొని నిలవాలని చూస్తోంది. యుద్ధ ట్యాంకులను అన్ని వైపుల నుంచి మోహరించేందుకు సమాయత్తమవుతోంది. దీన్ని ఉక్రెయిన్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. రష్యా దాడులను తిప్పికొట్టి తన సత్తా చాటాలని భావిస్తోంది. దాడులకు అనువైన స్థలాల కోసం రష్యా వెతుకుతోంది.
అమెరికా, జర్మనీ, జపాన్, పోలండ్, బ్రిటన్ తదితర దేశాల ఆంక్షలను రష్యా పెడచెవిన పెడుతోంది రష్యాకు చమురు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా లేవని హెచ్చరికలు పంపినా రష్యా మాత్రం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది. అన్ని దేశాలు ఐకమత్యంగా ఉన్నా రష్యా మాత్రం బెదరడం లేదు. తన యుద్ధ కాంక్షను పట్టించుకోవడడం లేదు. దీనిపై ఇంకా ఎంతటి విపత్కర పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు