మోడీ ఇంటర్వ్యూ ప్రచురించరట!

Update: 2015-04-11 04:40 GMT
ఏమాట కామాట చెప్పుకోవాలంటే... అభివృద్ధి చెందిన దేశాలలో కొందరికి గర్వం చాలా ఎక్కువ. ఎంతంటే... తమకు నేరుగా కాకుండా లిఖిత పూర్వకంగా ఇంటర్వ్యూ ఇచ్చారని ఏకంగా ఒక దేశ ప్రధాని ఇంటర్వ్యూనే ప్రచురించమని ప్రకటించేటంత! వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఫ్రెంచ్ వార్తాపత్రిక 'లె మోండ్' మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రచురించేందుకు తిరస్కరించింది. తమ దేశానికి అతిధిగా వచ్చిన మరో దేశ ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆలోచించే అంత సంస్కారం వారికి లేదే ఏమో కానీ... ప్రచురించమని నేరుగా చెప్పేసింది. ఈ విషయాలకు కారణం... మోడీతో వ్యక్తిగతంగా సంభాషించకుండా, వారిచ్చిన లిఖిత పూర్వక సమాధానాలనే ఇంటర్వ్యూను ప్రచురించమనడమేనట! అంతకుముందు ఆయనను కలిసి ఇంటర్వ్యూ తీసుకునేందుకు సదరు వార్తా పత్రికకు... మోడీ వెంటున్న అధికారులు అనుమతించలేదట. ఈ విషయాలన్ని వార్తాపత్రిక దక్షిణాసియా బ్యూరో చీఫ్ జులియన్ బౌస్సౌ ట్విట్టర్ లో తెలిపారు. నేరుగా ఇంటర్వ్యూ ఇచ్చేటంత సమయం మోడీకి ఉంటుందా, ఉండదా... అనే విషయాన్ని సదరు బ్యూరో చీఫ్ ఆలోచించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి! ఏది ఏమైనా... ఇది భారత ప్రధానికి జరిగిన అవమానంగా భావించాలా లేక ఆ పత్రిక కమిట్ మెంట్స్ కి నిలువుటద్దంగా చూడాలా అనేది ఎవరి ఇష్టం మేరకు వారు చెయ్యొచ్చు!
Tags:    

Similar News