భారత గణతంత్ర వేడుకలకు హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో హోలాన్ గౌరవార్దం ఇచ్చిన విందులో 50 కేజీల తాజ్ మహాల్ ఐశ్వర్యారాయ్ సందడి చేసింది. ఎర్రరంగు చీరలో మెరిసిపోయిన ఆమె తలలో రెండు గులాబీలు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి గౌరవార్తం ఇచ్చిన విందుకు ఆహ్వానం అందుకున్న ఆమె తన కుమార్తె ఆరాధ్యతో కలిసి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ఆమె భోజనం చేయడంతో పాటు సంభాషించారు కూడా. కాగా బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ - ఆదిత్య చోప్రా - మరికొందరు బాలీవుడ్ ప్రముఖులూ ఈ విందుకు హాజరయ్యారు.
మరోవైపు ఐశ్వర్యకు ఫ్రాన్స్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన ''నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్సు అండ్ లెటర్స్" ప్రదానం చేశారు. అలాగే షారూక్ కు ''ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్'' పురస్కారం అందుకున్నారు.
ఐశ్వర్య రాయ్ కు ఫ్రాన్సుతో 14 ఏళ్లుగా ప్రత్యేక అనుబంధం సాగుతోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు భారత తరఫున ఆమె శాశ్వత ప్రతినిధిగా 14 ఏళ్లుగా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఈ క్రమంలో భారత్ - ఫ్రాన్సుల మధ్య సాంస్కృతిక వారధిగా ఉన్నారు.