తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. తమకు హద్దే లేనట్లుగా ఆరాచకం సృష్టిస్తున్నారు. ప్యారిస్ లో జరిగిన నరమేధం తాలుకూ నెత్తుటి మరకలు ఇంకా చెరగక ముందే మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. కాకుంటే ఈసారి వేదిక మారింది. ఉగ్రవాద నిరోధానికి ఏం చేయాలన్న అంశంపై జీ20 దేశాలు టర్కీలో సమావేశం కానున్నాయి.
ఈ సమావేశాల్లో పాల్గొనటానికి భారతప్రధాని మోడీ టర్కీ వెళ్లారు. జీ20 దేశాల సమావేశాలు నిర్వహించే సమావేశ మందిరానికి సమీపంలో తాజా ఆత్మాహుతి దాడి జరగటం గమనార్హం. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ పోరాడాలని పిలుపునిచ్చేందుకు ఏర్పాటు చేసిన వేదికకు దగ్గర్లోనే ఉగ్రవాద చర్య చోటు చేసుకోవటం విస్తు కొల్పుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఆత్మాహుతి కారణంగా నలుగురు పోలీసులకు తీవ్రగాయాలు అయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.