వచ్చే ఎన్నికల్లో అయినా.. విజయం దక్కించుకోవాలి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలి. ప్రజలతో జై కొట్టించుకోవాలి. విజయం దిశగా దూసుకుపోయి.. వైసీపీకి షాకివ్వాలి. అదేసమయంలో సొంత పార్టీని పుంజుకునేలా చేసి.. పార్టీలో కీలక నేతగా ఎదగాలి!-ఇవీ.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడి లక్ష్యాలు. అయితే.. వీటిని సాధించడం అంత ఈజీయేనా? కలలు కన్నంత తేలికగా.. నగరిలో గెలుపు గుర్రం ఎక్కుతారా? ముద్దుకృష్ణ వారసత్వాన్ని మాటలతోనే నిలబెట్టేయడం సాధ్యమేనా? ఇవీ.. ఇప్పుడు ఆ యువనేతను ఉద్దేశించి.. వస్తున్న అనేక సందేహాలు.
ఆయనే.. గాలి భానుప్రకాశ్. మాజీ మంత్రి, రాజకీయ దిగ్గజ నేత, టీడీపీలో తనకంటూ.. ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ముద్దుకృ ష్ణమ పొలిటికల్ కిన్. గత ఎన్నికలకు ముందు.. ముద్దు కృష్ణ అకాల మరణం చెందారు. దీనికి ముందుగానే తన వారసుడిగా.. భానును ఆయన నగరి నియోజకవర్గానికి పరిచయం చేశారు. ఊరూరా తిప్పారు. గడప గడపకు పరిచయం చేశారు. భానులో తనను చూసుకోవాలని.. ప్రతి ఒక్కరినీ కోరారు. అయితే.. ఎన్నికలకు ముందు ఆయన మరణించారు. ఈ సమయంలో ప్రజల మధ్యే ఉంటూ.. సింపతీ దక్కించుకోవడంలో భాను విఫలమయ్యారనే వాదన ఉంది. టికెట్ అయితే.. దక్కించుకున్నా.. ఇంటి పోరుతో ఆయన సొంత సత్తాను చాటుకోలేక పోయారని అనేవారు ఇప్పటికీ ఉన్నారు.
ముద్దుకృష్ణ మరణంతో పదవుల కోపం.. ప్రాభవం కోసం.. ఆయన కుటుంబంలో రాజకీయ ముసలం పుట్టింది. ఇది.. నియోజకవ ర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. సరే.. ఒక ఓటమి ఓటమి కాదన్నట్టు.. ఆయన పుంజుకునే ప్రయత్నం చేసి ఉంటే. పరిస్తితి వేరేగా ఉండేది. కానీ, ఎన్నికలు వచ్చే వరకు వేచి చూసే ధోరణినే ఆయన అవలంభిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు టీడీపీ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యమం చేస్తోంది. దీనిని అందిపుచ్చుకుని భాను కూడా రోడ్డెక్కి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఆయన మౌనంగా ఉంటున్నారు. చంద్రబాబో.. లోకేషో.. నగరానికి వచ్చినప్పుడు తప్ప.. ఆయన పట్టించుకోవడం లేదు.
మరోవైపు అధికార పార్టీనాయకురాలు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రోజా.. ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి సొంత పార్టీలోనే రోజాకు సెగ తగులుతోంది. అలాంటిది టీడీపీ తరఫున కూడా భాను పుంజుకుని ఉంటే.. రోజా ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. కానీ, భాను సైలెంట్ రోజాకు కలిసి వస్తోంది. తనకు ప్రత్యర్థులు ఎవరూ లేరని.. సొంత పార్టీ నేతలే తనపై కత్తికట్టారని.. ఆమె ప్రజలను మరోసారి తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చే్స్తున్నారు. వారానికి మూడు రోజులు ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి సమస్యలు పట్టించుకుంటున్నారు. సొంత పార్టీ నేతలపై నే విమర్శలు చేస్తున్నారు తప్ప.. అసలు నియోజకవర్గంలో టీడీపీ నేతలనే ఆమె పట్టించుకోవడం లేదు. అంటే.. దీనిని బట్టి భాను గ్రాఫ్ ఎలా ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.