ఇటీవల మావోయిస్టు పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని, ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోంది. అయితే.. ఆయన దారెటు..? టీఆరెస్సా, కాంగ్రెస్సా..? వామపక్షాలా? లేదంటే కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా మరో మాట కూడా వినిపిస్తోంది. గద్దర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చేయి కలుపుతారన్న ప్రచారం మొదలైంది.
పవన్ జనసేన కార్యకలాపాలు ఏపీకే పరిమితమవుతున్నాయి. తెలంగాణలో ఇంతవరకు పవన్ తన ఉనికి చాటే ప్రయత్నం చేయలేదు. దీంతో గద్దర్ ను పార్టీ తరఫున ముందు పెట్టి తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసే యోచన ఉందంటున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన గద్దర్ ఇంజినీరింగ్ చదివి, బ్యాంకు ఉద్యోగం చేస్తూ ప్రజాగాయకుడిగా, మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా మారారు. అయితే, కొంత కాలంగా ఆయన మావోయిస్టులతో సంబంధాలు వదులుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికత కూడా కాస్త ఒంటపట్టింది. అయితే.. గద్దర్ ఏం చేసినా కూడా తెలంగాణలో ముసలివారి నుంచి చిన్నపిల్లల వరకు అంతా అభిమానిస్తారు. దీంతో అలాంటి ఛరిష్మా ఉన్న గద్దర్ ను తెలంగాణలో జనసేనకు ప్రధాన నేతను చేయాలని పవన్ కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఏమవుతుందో చూడాలి.. అసలు గద్దర్ మనసులో ఏముందో తెలియాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/