అన్నదమ్ముల సవాల్!

Update: 2018-07-27 17:44 GMT
ఇది సినిమా టైలిల్ కాదు...నగరి ఎంఎల్సీ పదవి కోసం గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు కుమారుల మధ్య జరుగుతున్న యుద్దం. సీనియర్ నేత గాలి ముద్దు క్రిష్ణమ నాయుడి హాఠత్మరణం తర్వాత - నగరి నియోజకవర్గంలో వారసత్త్వ పోరు మొదలయింది.  2018 ఫిబ్రవరీలో గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు  మరణంతో ఆ కుటుంబం పరువు రోడ్డున పడింది. ఎంఎల్సీ పదవి కోసం ఆయన కుమారులైన గాలి భానుప్రకాష్ - గాలి జగదీష్ ప్రకాష్  రోడ్డున పడ్డారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వారివురి మధ్య రాజీ చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. చివరికి గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు భార్య సరస్వతికి ఆ పదవి ఇచ్చేందుకు  తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించింది.

1983లో తెలుగుదేశం పార్టీలో చేరి పలుమార్లు పుత్తురు నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన విద్యా - అటవి శాఖ - ఉన్నత విద్యా శాఖలకు మంత్రిగా తన సేవలను అందిచారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి శాసన సభకు ఎన్నికయ్యారు. 2008లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి - 2014లో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ది రోజా చేతిలో ఓటమి పాలైయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఆయనే సీనియర్ నేత అయినందున - చంద్రబాబు నాయుడు ఆయనను గౌరవించి - ఎంఎల్సీ పదవిని ఇచ్చారు. గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు మరాణంతరం ఆయన భార్యకు ఎంఎల్సీ  పదవి ఇవ్వడంతో సమస్య తీరిపోలేదు - నగరి నియోజక వర్గం ఇన్‌ చార్జ్ పదవి కోసం అన్నదమ్ములిద్దరూ పోటిపడుతున్నారు. ఈ వారసత్వ పోరు వెళ్లిందంటే గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు పెద్ద కొడుకు తల్లినుంచి - తమ్ముడు నుంచి వేరుపడి పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నాడు. ఈ అన్నదమ్ముల వారసత్వ పోరుతో పార్టీ కార్యకర్తలు లలుపట్టుకుంటున్నారు.  నగరి నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టున్న నాయకుడు కావలనిఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం కార్యకర్తలు కోరినట్టు తెలిసింది.  అయితే 2019లో తన చిన్న కుమారుడైన జగదీష్ ప్రకాష్ పోటి చేస్తాడని - ప్రస్తుత ఎంఎల్సీ గాలి సరస్వతి స్పష్టం చేసారు.  కాని వచ్చే ఎన్నికలలో టిడిపి టికెట్టు తనకే వస్తుందని గాలి పెద్ద కుమారుడు ధీమ వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి బరిలోకి ఎవరు దిగుతారో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News