టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ కేవలం డ్యాషింగ్ ఓపెనర్ గానే కాదు.. ఇండియన్ టీంకు దూకుడు నేర్పించిన కెప్టెన్ గానూ పేరుంది. గంగూలీ కెప్టెన్ కాక ముందు పాక్, ఆస్ట్రేలియా వంటి జట్లు మనపై స్లెడ్జింగ్ తోనే సగం మ్యాచ్ గెలిచేసేవి. కానీ.. గంగూలీ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు.. తానే స్వయంగా ఢీ అంటే ఢీ అనేవాడు. మాటకు మాట సమాధానమే కాదు, బ్యాటుతోనూ సమాధానమిచ్చేవాడు. గంగూలీ బాటలోనే అంతా సాగి స్లెడ్జింగుకు ఉడుక్కోకుండా ధైర్యంగా మారారు.. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అలాంటి గంగూలీ మరోసారి టీమిండియాకు అండగా నిలుస్తూ ధైర్యం నూరిపోస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ఆసీస్ మాజీలంతా విరుచుకుపడుతుంటే తాను రంగంలోకి దిగి వారికి ఘాటైన సమాధానమిచ్చి నోరు మూయించాడు. కోహ్లి కాన్ఫిడెన్సు లెవల్స్ తగ్గించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి కోహ్లీలో కాన్ఫిడెన్సు నింపాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తీరు గురించి కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లకు భారత క్రికెట్ జట్టు మాజీకెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటైన రిప్లై ఇచ్చాడు. ఆసీస్ ఓపెనర్ రెన్షాని కొహ్లీ స్లెడ్జ్ చేసిన తీరుపై ఆసీస్ మాజీలు తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఇయాన్ హిలీ - మార్క్ వా - మాథ్యూ హైడెన్ కూడా కోహ్లీపై నోరు పారేసుకున్నారు. హిలీ అయితే.. ఒక అడుగు ముందుకు వేసి.. కొహ్లీపై తనకు గౌరవం పోయిందని అనేశాడు. ఇలా రెచ్చిపోతున్న ఆసీస్ వాగుడుకాయలకు బెంగళూరు టెస్టు విజయానంతరం గంగూలీ గట్టి డోస్ ఇచ్చాడు. వాళ్లనసలు లెక్క చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. హిలీ - మార్క్ వా - హైడెన్ లతో తను ఆడానని.. మైదానంలో వారి ప్రవర్తన ఎలా ఉండేదో తనకు తెలుసు అని.. అలాంటి వారికి నీతులు చెప్పే అర్హత లేదని దాదా అన్నాడు.
మైదానంలో కొహ్లీ తీరును తను వంద శాతం సమర్థిస్తానని సౌరవ్ అన్నాడు. కెప్టెన్ గా తనను కొహ్లీతో పోలిస్తే తను కొహ్లీలో సగమే.. అని కూడా సౌరవ్ అనడం విశేషం. అలాగే హిలీ వ్యాఖ్యల పట్ల కొహ్లీ కూడా స్పందించాడు. హిలీ తో తను పాఠాలు నేర్చుకునే పరిస్థితి లేదని.. యూట్యూబ్ లో హిలీ ఆటకు సంబంధించిన పాత వీడియోలను చూస్తే.. ఆయన తీరెంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుందని.. కొహ్లీ చురకలంటించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/