బీసీసీఐ.. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు. దానికి అధ్యక్షుడు అంటే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పటికే బీజేపీ పెద్దాయన, హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా దీనికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అధ్యక్షుడిగా గంగూలీ పదవీ కాలం ముగిసిన వేళ మళ్లీ అధ్యక్షుడు కాకుండా తప్పుకోవడమే హాట్ టాపిక్ గా మారింది. రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉండకపోవడం ఖచ్చితంగా బీజేపీ ఎఫెక్ట్ అని.. వాళ్లే గంగూలీని ఇంటికి పంపించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు గంగూలీ మౌనం వీడాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు.
నా జీవితంలో నేను మరింతగా ముందుకు సాగే ఉద్దేశంలో ఉన్నానంటూ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉండలేనంటూ క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా పెద్ద పనిచేయాలంటే అంతకుముందు చాలా ఇవ్వాల్సి ఉంటుందని.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దాదా వ్యాఖ్యలు చూస్తుంటే బీసీసీఐతో గంగూలీ ప్రయాణం ముగిసినట్టేనని తెలుస్తోంది. 15 ఏళ్ల పాటు ఇండియా తరుఫున క్రికెట్ ఆడిన గంగూలీ ఎన్నో మరిచిపోలేని విజయాలను అందించాడు. ఐపీఎల్ ను విజయవంతంగా నడిపించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సత్తా చాటాడు. మరి ఈ నేపథ్యంలో గంగూలీని పొగబెట్టి సాగనంపారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
కాగా గంగూలీ తప్పుకోవడంతో నెక్ట్స్ బీసీసీఐ ప్రెసిడెంట్ గా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎన్నికయ్యే అవకాశం ఉంది. 2019 అక్టోబర్ 23న గంటూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యారు. అక్టోబర్ 18న కొత్తగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోజర్ బిన్నీ బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇక బీజేపీలో చేరి బెంగాల్ లో లీడ్ చేయాలని గంగూలీని బీజేపీ పెద్దలు కోరారని.. ఒప్పుకోకపోవడంతోనే ఆయనను బీసీసీఐ నుంచి తప్పించారని వార్తలు వస్తున్నాయి. గంగూలీ పనితీరు బాగా లేదని.. యాక్టివ్ గా లేడనే తొలగిస్తున్నట్టు సమాచారం. ఇక గంగూలీని ఐసీసీ చైర్మన్ గా.. ఐపీఎల్ చైర్మన్ పదవిని ఆఫర్ ఇచ్చారని కానీ తీసుకోకుండా వైదొలిగాడని అంటున్నారు.