బీసీసీఐపై గంగూలీ స్కెచ్ ఇదే..

Update: 2019-11-12 01:30 GMT
భారత క్రికెట్ నియంత్రణ మండలిపై గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ అడుగులు వేస్తున్నారు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులైన గంగూలీ కేవలం 9 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. నిబంధనలు ఆయనకు అడ్డుగా మారాయి.

అందుకే డిసెంబర్ 1న గంగూలీ అధ్యక్షతన సమావేశమయ్యే బీసీసీఐ పాలకమండలి తాజాగా అధ్యక్షుడి పదవి కాలాన్ని, నిబంధనలు మార్చడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు బీసీసీఐలోని సంఘాలన్నింటిలో నాలుగింట మూడో వంతు మద్దతుతోపాటు సుప్రీం కోర్టు సైతం ఆమోదించేలా ప్రతిపాదనలు రూపోందిస్తోంది.

సుప్రీం కోర్టు కనుక ఈ కొత్త బీసీసీఐ రాజ్యాంగ మార్పునకు అంగీకరిస్తే దాదా ఆరేళ్లపాటు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే గంగూలీ భారత క్రికెట్ లో తన మార్క్ చూపిస్తున్నాడు. డే అండ్ నైట్ టెస్టులకు బీసీసీఐ  ఆమోదం తెలిపింది.  ఇండియా-బంగ్లాదేశ్ మధ్య డేనైట్ టెస్ట్ జరగనుంది. ఇక విరాట్ కోహ్లీని పక్కనపెట్టి రోహిత్ ను టీట్వంటీలకు బంగ్లాతో మ్యాచ్ లకు కెప్టెన్ చేయడం.. తదితర నిర్ణయాలను గంగూలీ చేసి బీసీసీఐలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.

ఇప్పుడు బీసీసీఐ అధిపతిగా గంగూలీ ఆరేళ్లపాటు ఉంటే క్రికెట్ ప్రక్షాళన ఖాయం. అందుకే బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించడానికి రెడీ అయ్యారు.సుప్రీం కోర్టు అంగీకారంపైనే గంగూలీ భవితవ్యం ఆధారపడి ఉంది.
Tags:    

Similar News