బెజవాడకు ప్రతి రెండు గంటలకూ ఓ విమానం

Update: 2015-08-29 04:10 GMT
ఏపీ రాజధాని విజయవాడకు రాజధాని కళ తీసుకొచ్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తుంది. ఇప్పటికే విజయవాడ అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రవాణా సౌకర్యాల పెంపు పై మరింత ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విమాన రాకపోకలు మరింతగా పెంచేందుకు చర్యలు షురూ చేశారు.

గతంలో రోజుకు 10 నుంచి 12 విమానాలు మాత్రమే గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చేవి. అయితే.. ఏపీ విభజన.. విజయవాడను తాత్కలిక రాజధానిగా చేసుకొని ఏపీ సర్కారు సైతం తరలిపోతున్న నేపథ్యంలో.. గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. గతంలో12 విమానాల స్థానే.. ఇప్పుడు 24 విమానాలు రోజూ వస్తున్నాయి. రద్దీ కూడా పెరిగింది.

ఈ నేపథ్యంలో విమానసౌకర్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా.. మరిన్ని విమానాలు విజయవాడకు వచ్చేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రెండు గంటలకు ఒక విమానం విజయవాడకు వచ్చేలా చేయాలని విమానయాన సంస్థతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. విజయవాడకు కనెక్టివిటీ పెంచటం ద్వారా రద్దీతో పాటు.. గన్నవరం ఎయిర్ పోర్ట్ కి రాజధాని కళ తీసుకురావాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News