అరే.. ఇది మ‌న గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టేనా?

Update: 2015-10-22 05:51 GMT
హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ని చూసిన  క‌ళ్ల‌తో గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ ను చూసే వాళ్ల‌కు.. రెండింటి మ‌ధ్య వ్య‌త్యానం స్ప‌ష్టంగా అర్థం కావ‌ట‌మే కాదు.. శంషాబాద్ స్థాయికి గ‌న్న‌వ‌రం ఎప్ప‌టికి వ‌చ్చేను అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

అమ‌రావ‌తి శంకుస్థాప‌న నేప‌థ్యంలో గురువారం గ‌న్న‌వ‌రం ఎయిర్‌ పోర్ట్ చూసిన వారికి మ‌తిపోయిన ప‌రిస్థితి.తాము ఉన్న‌ది గ‌న్న‌వ‌రంలోనేనా? అన్న సందేహం క‌లిగేలా ఉండ‌టం విశేషం.

ఎందుకంటే.. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ వ‌ద్ద బారులు తీరిన విదేశీ ల‌గ్జ‌రీ కార్ల‌తో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం మొత్తం క‌ళ‌క‌ళలాడిపోయింది. చాలామంది స్థానికులు.. శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన అతిధులు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ బ‌య‌ట కొలువు తీరిన విదేశీ ల‌గ్జ‌రీ కార్ల స‌ముదాయాన్ని చూసినంత‌నే శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం ఏ రేంజ్ లో సాగుతుంద‌న్న విష‌యం అర్థం కావ‌టంతో పాటు.. భ‌విష్య‌త్తు చిత్రం క‌ళ్ల ముందు క‌నిపించిందంటూ ప‌లువురు వ్యాఖ్యానించ‌టం క‌నిపిస్తోంది. అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంతో గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ రూపురేఖ‌లు మొత్తంగా మారిపోయింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.


Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx


Tags:    

Similar News