తెలుగు రాష్ర్టాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకోవడం - పోలింగ్ తేదీ సమీపిస్తుండుటంతో అందరి చూపు తెలంగాణ వైపు పడుతోంది. అదే సమయంలో ఆంధ్రాలో కూడా ఎన్నికల సీజన్ ప్రారంభం అవుతున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ టీఆర్ ఎస్ నేత - మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తామని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. అవసరమైతే ఆంధ్రాలో కూడా వేలు పెట్టేందుకు వెనుకాడమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి దాకా తరిమికొట్టిన చంద్రబాబుకు.. సరైన సమయంలో సీఎం కేసీఆర్ తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రకటన పొలిటికల్ హీట్ పెంచింది. అయితే, దీనికి టీడీపీ వైపు నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఓ మంత్రి టీఆర్ ఎస్ ప్రకటనను స్వాగతించారు.
కూకట్‌పల్లిలో జరిగిన సీమాంధ్రుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ `ఆంధ్రప్రదేశ్ తో మేం ఏనాడూ తగాదాలు కోరుకోలేదు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాడు. ఇక రాబోయే రోజుల్లో అవసరమైతే రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తాం. అసవరమొచ్చినప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో కూడా వేలు పెడుతా. ఫెడరల్ ఫ్రంట్ భాగంగా ఆంధ్రాలో మా పట్టు చూపెట్టి.. చంద్రబాబుకు కేసీఆర్ సరైన బుద్ధి చెబుతారు. మీడియా - డబ్బు చుట్టూ చంద్రబాబు రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీడీపీని తరిమికొడుతారనే నమ్మకం ఉంది` అని అన్నారు.
కాగా, కేటీఆర్ కామెంట్ కు టీడీపీ నేత - మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో అక్కినేని నాగేశ్వరరావు - దాసరి నారాయణరావు - నందమూరి హరికృష్ణ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ - హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని గతంలో కేసీఆర్ - కేటీఆరే చెప్పారన్నారు. ఆ విషయాలను వారు మరచిపోయినట్లు ఉన్నారు. టీడీపీ ఓ జాతీయ పార్టీ.. తెలంగాణలోనూ బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మాతో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. తెలంగాణలో చంద్రబాబును ప్రచారాన్ని చూసి కేసీఆర్ - కేటీఆర్ కు వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. జాతీయ పార్టీగా మార్చుకుని కేసీఆర్ ఆంధ్రాలో పోటీ చేసిన మాకు అభ్యంతరం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే, ఇది గంటా వ్యక్తిగతమా లేక పార్టీ మాటనా తేలాల్సి ఉంది!