టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీసారి ఎన్నికల వేళ పార్టీలు మారుతూ అధికారంలోకి వచ్చే పార్టీని అంచనావేసి మరీ చేరి గెలిచి మంత్రి అయ్యేవారు.. నిత్యం అధికార పార్టీ నేతగా వెలుగొందుతూనే ఉంటారు. టీడీపీలో నుంచి ప్రజారాజ్యంలో చేరి.. అటు నుంచి మళ్లీ కాంగ్రెస్ లోకి విలీనం అయ్యి నాటి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి పొందారు. 2014 ఎన్నికల వేళ టీడీపీలో చేరి గెలిచి మరోసారి మంత్రి అయ్యారు.
అయితే గంటా 2019లో మాత్రం పార్టీ మారలేదు. టీడీపీలోనే ఉన్నారు. గెలిచి మళ్లీ మంత్రి అవుదామని కలలుగన్నట్టున్నారు.. కానీ ఈసారి అంచనా తప్పింది. అయితే వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచారు కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. వైసీపీ అధినేత జగన్ చేర్చుకుంటే వైసీపీలో చేరేవారేమో తెలియదు కానీ గంటా మాత్రం ఈసారి అంచనా తప్పిపోయారు. గెలిచినా అధికారానికి దూరంగా ప్రతిపక్షంలో ఉండిపోయారు.
అయితే బెల్లం చుట్టూ ఈగల సిద్ధాంతం వలే అధికారంలోనే ఎప్పుడు ఉంటూ వచ్చిన గంటా ఈసారి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.. బలమైన కాపు సామాజికవర్గ నేత అయిన గంటాకు పలుకుబడి - పరపతి ఎక్కువ. ఉత్తరాంధ్రపై ఆయన ప్రభావం ఉంటుంది. అందుకే ఈయనను బీజేపీ లాగేస్తోందన్న వార్తలు గుప్పుమన్నాయి.
ఇక బీజేపీతో చెడిందో లేక.. నిజంగానే టీడీనీ పార్టీకి వీరవిధేయుడో కానీ గంటా మాత్రం తన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించారు. కార్యకర్తలు - నేతలు - ముఖ్య అనుచరులతో సమావేశమై క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పుకార్లకు ప్రతీసారి వివరణ ఇచ్చుకోలేనని.. ఓట్లేసి గెలిపించిన ప్రజలు - కార్యకర్తలకు ఇదే నా జవాబు దారి అని పార్టీ మార్పు అవాస్తవం అని తేల్చిచెప్పారు. దీన్ని బట్టి ఈసారి గంటా ప్రతిపక్షంలో ఉండిపోవడానికే డిసైడ్ అయ్యాడని చెప్పొచ్చు..