కేరళలో ‘జార్జ్ ఫ్లాయిడ్’ తరహా ఉదంతం !

Update: 2020-09-16 11:10 GMT
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ ఒక్క ఘటన దేశవ్యాప్త అల్లర్లు, ఆందోళనలకు కారణమైంది. ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. ఓ వ్యక్తిని నేలకేసి కొట్టిన పోలీసు అధికారి అతడిపై కూర్చున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా పోలీసులపై నిరసన తెలుపుతున్నారు.

కేరళ గోల్డ్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంత్రి కేటి జలీల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా, ఆయన కాన్వాయ్ వెళుతున్న సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు జలీల్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో ఓ పోలీస్ అధికారి కాంగ్రెస్ యువజన నాయకుడు ఆంటోని కింద పడిపోవడంతో అతడిని నెలకేసికొట్టి తలపై కాలు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. దీనిని గమనించిన సహచరులు అక్కడికి చేరుకుని అతనిని రక్షించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ కాంగ్రెస్ నేత వీటీ బలరామ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పినరయి విజయన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంటోనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమెరికాలో పోలీసుల దౌర్జన్యం కారణంగా మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ ‌ను తలపిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అమెరికాలోని జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను తలపించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News