ఇండియాలో తొలి కరోనా -ఫ్రీ జోన్...ఏదంటే?

Update: 2020-04-18 08:10 GMT
దేశంలో అత్యధిక విదేశీ పర్యాటకులు రాకపోకలు చేసే అత్యంత సుందరమైన ప్రదేశం  అక్కడ  టూరిస్ట్ ప్లేసెస్ ఎప్పుడూ ర‌ద్దీగా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే..గోవాలో మాత్రం గ్రీన్‌ జోన్ క‌నిపిస్తుంది.  చైనాలో కరోనా వైరస్ ప్రబలుతున్న సమాచారం తెలియగానే గోవా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దేశంలోనే తొలిసారిగా విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించేందుకు స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఫలితంగా కరోనా వైరస్ రోగులు తమ రాష్ట్రంలోకి చొరబడకుండా జాగ్రత్త పడింది.

దీనితో అక్కడ గత రెండు వారాలుగా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మార్చి 25న గోవాలో తొలి కేసు నమోదైంది. అయితే, ఏప్రిల్ 3 నుంచి గోవాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇందుకు గోవా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు స్థానికులు లాక్‌ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం మరో కారణం. అలాగే , జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చి 22 నుంచే గోవా అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేసింది. ముఖ్యంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వాహనాలేవీ గోవాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది.  

గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల నుండి విపరీతమైన మద్దతు లభించింది. ఫలితంగా ఏప్రిల్ 3 వరకు గోవాలో ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇప్పటికే వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ ఒక్కరు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే గోవాలో ‘సున్నా’ కరోనా కేసులతో.. దేశంలోనే తొలిసారి వైరస్-ఫ్రీ జోన్ కానుందని గోవా అధికారులు చెబుతున్నారు. దీనితో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా గోవాను అనుస‌రించాలి అని   నిపుణులు చెప్తున్నారు.
Tags:    

Similar News