ఏపీ, తెలంగాణలకు కేంద్రం గుడ్ న్యూస్

Update: 2019-10-18 10:56 GMT
అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రా.. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో సీనియర్ ఐఏఎస్ రెండు మూడు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. కొంత మంది నచ్చక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఇక తెలంగాణలో 31 జిల్లాల విభజనతో గ్రూప్ 1 అధికారులను కూడా కలెక్టర్లు, జేసీగా నియమించి నెట్టుకొస్తున్న పరిస్థితి. అందుకే ఈ అధికారుల కొరత తీర్చేందుకు కేంద్రం నడుం బిగించింది. తాజాగా ఏపీ, తెలంగాణ సీఎంలకు శుభవార్త చెప్పింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 18 మంది ఐఏఎస్ లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఏడుగురు, ఏపీకి 11 మందిని కొత్తగా కేటాయించింది. తీవ్రంగా ఐఏఎస్ ల కొరత ఉన్న దృష్ట్యా పరిపాలనకు అవసరమైన మేరకు ఐఏఎస్ లను కేటాయించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ ల కొరత పాలన పడకేసింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉన్నతాధికారులు కరువయ్యారు. ఇలాంటి నేపథ్యంలోనే కరువు తీరేలా ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎంల పాలనకు సహకారం అందించింది.


Tags:    

Similar News