ఏపీ సర్కారు బీరు బాబులకు మరింత జోష్

Update: 2019-01-29 06:22 GMT
ఏపీ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అందరికీ తాయిలాలు ప్రకటిస్తోంది. తాజాగా మందుబాబులను కూడా వదలకుండా వారికో తీపి కబురును అందించింది. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కారు మందుబాబుల గొంతును తడిపేందుకు సిద్ధమవుతోంది.

ఎన్నికల సమయం కావడం.. ఎండాకాలం రావడంతో ఏపీ సర్కారు మందుబాబులకు మరింత జోష్ నిచ్చేందుకు చీప్ లిక్కర్ తరహాలో చీప్ బీరును అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 30 నుంచి 40 రూపాయలు తక్కువకే కొత్త బ్రాండ్ ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. సోమవారం నుంచే ఈ బ్రాండ్ షాపుల్లోకి వచ్చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. స్ట్రాంగ్ బీరు ధర రూ.130 కాగా.. లైట్ బీరు రూ.110కు దొరుకుతోంది. కానీ ఏపీ సర్కారు నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేసి బ్రేవరిలో రూ.70కే 650 ఎంఎల్ బీరును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడం విశేషం.

కాగా తెలుగు రాష్ట్రాల్లో విక్రయించే లిక్కర్ లో 40 శాతం అల్కాహాల్, బీరులో 5 నుంచి 7శాతం అల్కాహాల్ ఉంటుంది. తాజాగా చీప్ బీరులో కూడా 5శాతమే అల్కాహాల్ పరిమాణం ఉంటుంది. రాష్ట్రంలో మద్యం ధరలు మండిపోతున్నాయన్న విమర్శలకు స్పందించి సర్కారు ఈ చీప్ బీరును తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మద్యం ధరలు మండిపోతున్నాయి. చీప్ లిక్కర్ ను తప్పించి అన్నింటిని ఏపీ సర్కారు పెంచేసింది. మొన్నటి పెంపుకే జనాలు గుస్సాగా ఉన్నారు.. అందుకే అంత రేటు పెట్టి కొనలేని వారికోసం  తక్కువ ధరకు బీరును అందుబాటులోకి తెస్తున్నారు.
    

Tags:    

Similar News